Breaking News

'నారప్ప' ఓటీటీ రిలీజ్‌ వల్ల నిర్మాతలకు అంత లాభమా!

Published on Fri, 07/23/2021 - 11:04

ఒరిజినల్‌ కథ అయినా, రీమేక్‌ కంటెంట్‌ అయినా హీరో వెంకటేశ్‌ విజృంభిస్తాడు. ఎలాంటి పాత్ర అయినా సరే అందులో ఒదిగిపోయి తన నటనతో, డైలాగులతో ప్రేక్షకులకు కనులవిందు చేస్తాడు. ఇటీవలే వచ్చిన నారప్పలోనూ అమోఘంగా నటించి అందరిచేత ప్రశంసలు అందుకున్నాడు వెంకీ మామ. అయితే ఓటీటీ వద్దు థియేటరే ముద్దు అంటూ టాలీవుడ్‌లో చర్చ జరుగుతున్న సమయంలో పెద్ద సినిమా నారప్ప ఓటీటీలో రిలీజై అందరికీ షాకిచ్చింది.

అయితే ఇది కావాలని తీసుకున్న నిర్ణయం కాదని, కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల నారప్ప ఓటీటీలో రిలీజ్‌ చేశామని దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాల, నిర్మాతలు సురేశ్‌బాబు, కలైపులి థాను మీడియాకు వెల్లడించారు. ఇదలా వుంచితే ఇంతకీ అమెజాన్‌ ప్రైమ్‌ నారప్ప సినిమాను ఎన్ని కోట్లకు సొంతం చేసుకుంది? నిర్మాతలకు ఎంత లాభం దక్కిందన్నది టాలీవుడ్‌లో ఆసక్తికరంగా మారింది.

తమిళ అసురన్‌కు రీమేక్‌గా వచ్చిన నారప్ప సినిమాను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇది సుమారు రూ.40 కోట్లు ముట్టజెప్పి ఈ సినిమాను సొంతం చేసుకుందట. దీని ప్రకారం ఈ డీల్‌ ద్వారా నిర్మాతలకు సుమారు రూ.17 కోట్ల మేర లాభం వచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు సురేశ్‌బాబు వెంకటేశ్‌ నటించిన మరో రీమేక్‌ దృశ్యం 2ను వీలైనంత త్వరగా రిలీజ్‌ చేయాలని చూస్తున్నాడు. మరి ఇది కూడా ఓటీటీలోనే వస్తుందా? లేదా థియేటర్లలో రిలీజ్‌ అవుతుందా? చూడాలి.

Videos

Watch Live: వైఎస్ జగన్ కీలక ప్రెస్ మీట్

వాషింగ్టన్ డీసీలో కాల్పుల కలకలం

దీన్నే నమ్ముకొని ఉన్నాం.. మా పొట్టలు కొట్టొద్దు.. ఎండీయూ ఆపరేటర్ల ధర్నా

నా పర్మీషన్ తీసుకోవాల్సిందే!

ఢిల్లీ-శ్రీనగర్ విమానానికి తప్పిన ప్రమాదం

ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు బండారం బయటపడుతుందనే ఉరవకొండకి రాలేదు

జనసేనపై పిఠాపురం టీడీపీ నేతలు సంచలన వ్యాఖ్యలు..

ఏందిరయ్యా ఏంజేతున్నావ్

హైదరాబాద్ లో పలుచోట్ల వర్షం

పాక్ లో నన్ను పెళ్లి చేసుకో.. టెర్రరిస్టులతో జ్యోతి లవ్ స్టోరీ

Photos

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)

+5

'హరి హర వీరమల్లు' సాంగ్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

కాన్స్‌లో అదితి : ఆరుగజాల చీర, సింధూరంతో ముగ్ధమనోహరంగా (ఫొటోలు)

+5

కుమారుడి టాలెంట్‌ చూసి మురిసిపోతున్నడైరెక్టర్‌ సుకుమార్ భార్య (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో అనామిక ఖన్నా బ్యాక్‌లెస్ గౌనులో జాన్వీ కపూర్‌ (ఫోటోలు)