Breaking News

హిట్‌ కాంబినేషన్‌లో వెంకటేష్‌ సినిమా ప్రారంభం

Published on Fri, 08/15/2025 - 14:50

ఈ ఏడాదిలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి బ్లాక్‌బస్టర్‌ మూవీ తర్వాత వెంకటేష్‌ కొత్త (Venky 77) సినిమాను ప్రారంభించారు. నేడు దర్శకుడు త్రివిక్రమ్‌తో వెంకీ సినిమా షూటింగ్‌   ప్రారంభమైంది. తాజాగా కొబ్బరికాయ కొట్టి షూటింగ్‌ ప్రారంభించారు. మరికొద్దిరోజుల్లోనే రెగ్యూలర్‌ షూటింగ్‌ కూడా మొదలు కానుంది.

వెంకటేశ్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో ఇప్పటికే రెండు సినిమాలు వచ్చాయి. నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరిలకు త్రివిక్రమ్‌ రైటర్‌గా పనిచేసిన విషయం తెలిసిందే. అయితే, ఈసారి త్రివిక్రమ్‌ దర్శకత్వంలోనే వెంకీ నటిస్తున్నారు. ఇందులో హీరోయిన్స్‌గా త్రిష, రుక్ష్మిణీ వసంత్‌, నిధి అగర్వాల్‌, మీనాక్షి చౌదరి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. వారిలో ఇద్దరు నటించనున్నారు. హారిక అండ్‌ హాసినీ క్రియేషన్స్ పై ఎస్‌.రాధాకృష్ణ నిర్మించనున్న ఈ మూవీ వచ్చే ఏడాది సమ్మర్‌లో విడుదల కానుంది.

వెంకటేష్‌ చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. మీనాతో కలిసి ఓ సినిమా (దృశ్యం 3) చేయనున్నారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ తర్వాత అనిల్‌ రావిపూడి దర్వకత్వంలోనే మరో సినిమా ఉంది. ఈ చిత్రాలతో పాటు మెగాస్టార్‌ చిరంజీవి మూవీలో అతిథి పాత్రలో కనిపించనున్నారు. ఇక అనిల్‌ రావిపూడి దర్శకత్వంలోనే వెంకటేష్‌ చేయబోయే సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’ సీక్వెల్‌ ‘మళ్లీ సంక్రాంతికి వస్తున్నాం’ కూడా ఉంది. ఇలా వరుస సినిమాలతో ఆయన ఫుల్‌ బిజీగా ఉన్నారు. 
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)