Breaking News

కోలీవుడ్‌ స్టార్స్‌తో దర్శకుడి ఫ్రెండ్‌షిప్‌.. ఫోటో వైరల్‌

Published on Tue, 08/08/2023 - 10:33

స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం.. ఇది పాట మాత్రమే కాదు. జీవనామృతం. ఈ కాలంలో ప్రేమాభిమానాలను పంచుకోవాల్సిన కుటుంబ సభ్యులే ద్వేషాలను పెంచుకుంటున్నారు. అందరూ కాకపోయినా ఎక్కువ మంది కుటుంబాల్లో జరుగుతోంది ఇదే. అయితే ఒక్కోసారి గొడవలు పడ్డా, కొట్టుకున్నా కష్టకాలంలో అండగా నిలుస్తుంది స్నేహితులు మాత్రమే. కాగా సోమవారం స్నేహితుల దినోత్సవాన్ని ప్రపంచమంతా జరుపుకుంది.

సినీ పరిశ్రమలోనూ హీరోల అభిమానులు తమ హీరో గొప్ప అంటే తమ హీరో తోపు అని సామాజిక మాధ్యమాల్లో విమర్శించుకోవడం పరిపాటే. తమిళ సినిమాలో ఒకప్పుడు రజినీకాంత్‌, కమల్‌ హాసన్‌ అభిమానులు ఈ విషయంలో తీవ్రంగా గొడవపడేవారు. అయితే రాను రానూ ఆ పరిస్థితి తగ్గుతూ వచ్చింది. ఆ తర్వాత విజయ్‌, అజిత్‌ అభిమానుల మధ్య ఇలాంటి పోటీ తీవ్ర రూపు దాల్చింది. ఇప్పుడు అది కూడా సన్నగిల్లింది. తాజాగా రజనీకాంత్‌, విజయ్‌ అభిమానుల మధ్య ఎవరు సూపర్‌ స్టార్‌? అన్న వివాదం నడుస్తోంది.

అయితే హీరోలు మాత్రం తామంతా ఒకటేనని వివాదాలు వద్దని తమ అభిమానులకు హితవాఖ్యలు చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ అభిమానులకు అది తలకెక్కడం లేదు. కాగా దర్శకుడు వెంకట్‌ ప్రభు చుట్టూ ఎప్పుడు చూసినా మిత్ర బృందమే ఉంటుంది. స్నేహానికి అంత విలువనిచ్చే ఆయన స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఆయన ట్విటర్‌లో 'ఇది చాలా సంతోషకరమైన స్నేహితుల దినోత్సవం. ప్రేమను వ్యాపింపజేయండి' అని పేర్కొన్నారు. అందులో నటుడు రజనీకాంత్‌, కమల్‌ హాసన్‌, గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్పీ చరణ్‌, ఆయన తండ్రి గంగై అమరన్‌ తో కలిసి ఉన్న ఫొటోలను పోస్ట్‌ చేశారు. అదేవిధంగా విజయ్‌, అజిత్‌తో కలిసి ఉన్న మరో ఫొటోను పోస్ట్‌ చేశారు.

చదవండి: మిగతా హీరోయిన్లకు సమంత కథ వేరే!

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)