Breaking News

ధోనీని హైలైట్‌ చేయడం తెలుగు వాళ్లకు నచ్చలేదు: వెంకట్‌ ప్రభు

Published on Tue, 09/10/2024 - 08:58

కోలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్‌ నటించిన లెటెస్ట్‌ మూవీ ‘ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌’ (ది గోట్‌). వెంకట్‌ ప్రభు దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 5న విడుదలై మంచి టాక్‌తో దూసుకెళ్తోంది. అయితే కోలీవుడ్‌లో హిట్‌ టాక్‌ వచ్చినా.. బాలీవుడ్‌, టాలీవుడ్‌లో మాత్రం ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభించింది. రివ్యూస్‌ కూడా నెగటివ్‌గా రావడంతో ఈ రెండు చోట్ల కలెక్షన్స్‌ కూడా తగ్గిపోయాయి. 

తాజాగా ఈ విషయంపై వెంకట్‌ ప్రభు స్పందిస్తూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ చిత్రంలో టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీని హైలైట్‌ చేయడం తెలుగు, హిందీ ప్రేక్షకులకు నచ్చలేదని, అందుకే అక్కడ ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదని అభిప్రాయపడ్డాడు. వెంకట్‌ ప్రభు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశంగా మారాయి. దీనిపై నెటిజన్స్‌ మిశ్రమంగా స్పందిస్తున్నారు. ధోనీని హైలైట్‌ చేయడం వల్ల ఫలితం రాలేదనడం కరెక్ట్‌ కాదని నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు. 

(చదవండి: ఏడాదిన్నర ఆగితే.. 12 రోజులు షూట్‌ చేశారు: బాబీ డియోల్‌)

మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో ప్రశాంత్‌, ప్రభుదేవా, వైభవ్‌, లైలా, స్నేహ ఇతరులు కీలక పాత్రలు పోషించారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌తో దివంగత నటుడు విజయకాంత్‌ని, ఐపీఎల్‌ విజువల్స్‌ ద్వారా ధోనీని వెండితెరపై చూపించారు. ఇప్పటి వరకు దాదాపు రూ. 300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. 

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)