Breaking News

ఘంటసాల సినిమా చూడటం తెలుగు వారి కర్తవ్యం: మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

Published on Mon, 12/02/2024 - 03:19

‘‘ఘంటసాలగారిని శతాబ్ది గాయకుడు (సింగర్‌ ఆఫ్‌ సెంచరీ) అంటారు. ఆయన్ను నేను అమర గాయకుడు అంటాను. ఒక సాధారణ వ్యక్తిగా మొదలైన ఆయన జీవితం సంగీతంతో సాగుతూ... స్వాతంత్య్ర సమరయోధుడిగానే కాకుండా, సినీ గాయకుడిగా, సంగీత దర్శకుడిగా, భగవద్గీత గానాన్ని అందించిన తొలి తెలుగు స్ఫూర్తిగా భావితరాలకు ఆయన ఆదర్శంగా నిలుస్తారని భావిస్తున్నాను’’ అన్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. దివంగత ప్రముఖ గాయకులు ఘంటసాల వెంకటేశ్వరరావు జీవితం ఆధారంగా తెరకెక్కిన బయోపిక్‌ ‘ఘంటసాల: ది గ్రేట్‌’.

ఈ చిత్రంలో ఘంటసాలపాత్రలో కృష్ణచైతన్య నటించారు. ఘంటసాల భార్య సావిత్రిపాత్రలో కృష్ణచైతన్య భార్య మృదుల నటించారు. సీహెచ్‌ రామారావు దర్శకత్వంలో సీహెచ్‌ ఫణి నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 14న రిలీజ్‌  కానుంది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ అనౌన్స్‌మెంట్‌పోస్టర్‌ లాంచ్‌ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ– ‘‘ఘంటసాలగారిపై సినిమా తీసినందుకు ఫణిగారిని అభినందిస్తున్నాను. కృష్ణచైతన్య, మృదులలను మెచ్చుకుంటున్నాను.

సదుద్దేశంతో తీసిన ఈ సినిమా చూడటం తెలుగు వారి కర్తవ్యం’’ అన్నారు. మరో అతిథి దర్శక–నిర్మాత–నటుడు ఆర్‌. నారాయణమూర్తి మాట్లాడుతూ– ‘‘ఘంటసాలకు భారతరత్న ఇవ్వాలి. ఉత్తరాది గాయకులకు ఇచ్చి ఆయనకు ఎందుకు ఇవ్వలేదు? ఎంజీఆర్‌కు భారతరత్న ఇచ్చి ఎన్టీఆర్‌కు ఇవ్వలేదు. ఆయనకూ ఇవ్వాలి’’ అని అన్నారు. ‘‘మా సినిమాను ప్రేక్షకులకు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు కృష్ణచైతన్య. ‘‘ఘంటసాలగారిపాట ఎంత గొప్పదో అందరికీ తెలుసు. కానీ ఆయన వ్యక్తిత్వం కొందరికే తెలుసు. ఆయన వ్యక్తిత్వాన్ని, జీవితాన్ని ఈ సినిమాలో చెప్పడం జరిగింది’’ అని తెలిపారు సీహెచ్‌ రామారావు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)