సల్మాన్‌ ఖాన్‌ను చంపేస్తామన్న కూరగాయల వ్యాపారి అరెస్ట్‌

Published on Thu, 10/24/2024 - 12:02

బాలీవుడ్ నటుడు సల్మాన్​ ఖాన్‌ను చంపేస్తానంటూ కొద్దిరోజుల క్రితం బెదిరింపు మెసేజ్​ పెట్టిన వ్యక్తిని ముంబై పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితుడు ఝార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌కు చెందిన షేక్ హుస్సేన్  (24)గా గుర్తించారు. గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ నుంచి సల్మాన్‌కు వరుస బెదిరింపులు వస్తున్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో హుస్సేన్ కూడా అదే గ్యాంగ్‌కు సంబంధించిన వ్యక్తి అంటూ సల్మాన్‌ నుంచి రూ. కోట్లు ఇప్పించాలని డిమాండ్‌ చేస్తూ.. ట్రాఫిక్‌ పోలీసులకు మెసేజ్‌ చేశాడు.

సల్మాన్‌కు లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ నుంచి ప్రమాదం పొంచి ఉండటంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఈ క్రమంలో బెదిరింపు మెసేజ్‌ చేసిన వ్యక్తి కూరగాయల వ్యాపారి షేక్ హుస్సేన్‌గా పోలీసులు గుర్తించారు. సులభంగా డబ్బు సంపాదించవచ్చనే తాను ఇలాంటి ప్లాన్‌ వేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. అయినప్పటికీ అతన్ని  పూర్తిగా విచారించిన తర్వాతే కోర్టులో హాజరుపరచనున్నారు.

ముంబయి ట్రాఫిక్‌ పోలీసులకు కొద్దిరోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఒక మెసేజ్‌ వచ్చిన విషయం తెలిసిందే.. సల్మాన్‌ ప్రాణాలతో ఉండాలంటే రూ.5 కోట్లు ఇవ్వాలని వార్నింగ్ ఇచ్చారు. ఈ మెసేజ్‌ను తేలిగ్గా తీసుకోవద్దని హెచ్చరించారు. బిష్ణోయ్‌తో శతృత్వం ఆగాలన్నా, సల్మాన్‌ బతికుండాలన్నా ఐదు కోట్లు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తూ వాట్సాప్‌లో మెసేజ్ వచ్చింది. అయితే, ఒకరోజు తర్వాత అతను మరో సందేశం ఇలా పంపించాడు. 'నేను కావాలని బెదిరింపులకు పాల్పడలేదు. అనుకోకుండా జరిగిపోయింది. క్షమించండి' అని పేర్కొన్నాడు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న ముంబై పోలీసులు దర్యాప్తు చేపట్టి.. జంషెడ్‌పూర్‌ చెందిన ఓ కూరగాయల వ్యాపారి ఇదంతా చేసినట్లు గుర్తించి అతన్ని అరెస్ట్‌ చేశారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)