Breaking News

అలాంటి సినిమాలు చేయను : వశిష్ట ఎన్‌. సింహ

Published on Thu, 04/24/2025 - 07:22

‘‘హారర్, కాలేజ్‌ లవ్‌స్టోరీ సినిమాలు చేయాలనుకోవడం లేదు. ఒకవేళ ఎవరైనా నాకు అలాంటి కథలు చెప్పాలనుకుంటే సమయం వృథా చేసుకోవద్దని చెబుతాను. ‘ఓదెల 2’ చిత్రం హారర్‌ ఫిల్మ్‌ కాదు.. దైవానికి, దుష్ట శక్తికి మధ్య వైరం. ఈ మూవీలో నేను ఓ ఆత్మ పాత్ర చేశాను. హీరో, విలన్‌  అని కాదు.. ప్రేక్షకుల చేత మంచి నటుడిగా పేరు తెచ్చుకోవాలన్నదే నా లక్ష్యం’’ అని వశిష్ఠ ఎన్‌ . సింహా (Vasishta N. Simha) చెప్పారు. తమన్నా భాటియా లీడ్‌ రోల్‌లో నటించిన చిత్రం ‘ఓదెల 2’(Odela 2 Movie). దర్శకుడు సంపత్‌నంది సూపర్‌ విజన్‌లో అశోక్‌ తేజ దర్శకత్వంలో డి. మధు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న విడుదలైంది. 

ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించిన వశిష్ట ఎన్‌ . సింహా బుధవారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ– ‘‘కిరాక్‌ పార్టీ’ (2018) సినిమాలోని ‘నీచమైన..’ అనే పాటను పాడి, సింగర్‌గా తెలుగులోకి వచ్చాను నేను. కన్నడలో నన్ను సింగర్‌గా పరిచయం చేసిన మ్యూజిక్‌ డైరెక్టర్‌ అజనీష్‌ లోక్‌నాథ్‌గారే తెలుగులోనూ గాయకుడిగా పరిచయం చేశారు. ఇక ‘ఓదెల రైల్వేస్టేషన్‌ ’ సినిమా తర్వాత ఓ రోజు సంపత్‌ నందిగారు కాల్‌ చేసి, ‘ఓదెల 2’ గురించి, నా పాత్ర గురించి చెప్పినప్పుడు సర్‌ప్రైజ్‌ అయ్యాను. 

ఈ తరహా దెయ్యం పాత్ర నేను ఎప్పుడూ చేయలేదని వెంటనే ఓకే చెప్పాను. ఈ సినిమాలోని సమాధి శిక్ష సీక్వెన్స్‌ సవాల్‌గా అనిపించింది. ‘ఓదెల 2’ లో స్క్రీన్‌ పై తిరుపతి ఉన్నా లేకపోయినా అతని నామస్మరణ మాత్రం సినిమాలోని క్యారెక్టర్స్‌ చెబుతూనే ఉంటాయి. అలా ఈ సినిమాకు ఎవరైనా హీరో ఉంటే అది తిరుపతి పాత్రే. 

తమన్నాగారు నాగసాధువుగా అద్భుతంగా నటించారు. సంపత్‌నందిగారు ‘ఓదెల 2’ కథను అద్భుతంగా రాశారు. అశోక్‌ తేజ మంచి విజన్‌  ఉన్న డైరెక్టర్‌. డి.మధుగారు ప్యాషనేట్‌ ప్రొడ్యూసర్‌. డిఫరెంట్‌ రోల్స్‌తో ఆడియన్స్‌ నన్ను గుర్తుపెట్టుకునే పాత్రలు చేయాలని ఉంది’’ అని అన్నారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)