Breaking News

నాపాత్ర సరికొత్తగా ఉంటుంది: వశిష్ట ఎన్‌. సింహా

Published on Wed, 08/27/2025 - 01:12

‘‘త్రిబాణధారి బార్బరిక్‌’ చిత్ర కథ మన చుట్టూనే జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. ఇప్పటి వరకు నేను నెగెటివ్‌ రోల్స్‌పోషించాను. కానీ,  ఈ సినిమాలో నాపాత్ర సరికొత్తగా ఉంటుంది. సమాజాన్ని ప్రతిబింబించేలా మా చిత్రం, నాపాత్ర ఉంటుంది’’ అని వశిష్ట ఎన్‌. సింహా తెలిపారు. సత్యరాజ్, ‘సత్యం’ రాజేష్, ఉదయభాను, వశిష్ట ఎన్‌. సింహా(Vasishta N Simha) కీలకపాత్రలు పోషించిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్‌’. మోహన్‌ శ్రీవత్స దర్శకత్వం వహించారు.

మారుతీ టీమ్‌ ప్రోడక్ట్‌ సమర్పణలో విజయపాల్‌ రెడ్డి అడిదల నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 29న విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో వశిష్ట ఎన్‌. సింహా మాట్లాడుతూ–‘‘ఈ చిత్రంలో బార్బరికుడు కనిపించడు.. అతని శక్తిని చూస్తారు. ఈ చిత్రం చూశాక మన జీవితంలోనూ సత్య రాజ్‌గారి లాంటి ఓ తాత ఉంటే బాగుంటుందనిపిస్తుంది. ఉత్తరాది, దక్షిణాది అని కాకుండా అందరికీ కనెక్ట్‌ అయ్యే భావోద్వేగాలతో తీశాం.

మా చిత్రం ప్రేక్షకులను ఎక్కడా నిరాశ పరచదు. విజయ్‌పాల్‌ రెడ్డికి సినిమా పట్ల ఎంతో ఫ్యాషన్‌ ఉంది. దర్శకుడు మోహన్‌కి మంచి భవిష్యత్తు ఉంటుంది. మా అబ్బాయికి ప్రస్తుతం ఏడు నెలలు. బాబే మా ప్రపంచం (హరిప్రియ–వశిష్ట). షూటింగ్‌కి వెళ్లినప్పుడు తనని చాలా మిస్‌ అవుతున్నాను’’ అని చెప్పారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)