Breaking News

అశ్విన్స్‌ సక్సెస్‌.. బాధ్యత మరింత పెరిగిందన్న హీరో

Published on Sat, 07/22/2023 - 12:00

తరమని చిత్రంతో నటుడుగా తనదైన ముద్రవేసుకున్న వసంత రవి ఆ తర్వాత రాఖీ చిత్రంతో మాస్‌ హీరోగా ముద్ర వేసుకున్నారు. తాజాగా ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం అశ్విన్స్‌. 25 రోజుల క్రితం విడుదలైన ఈ వైవిధ్యభరిత హారర్‌, సస్పెన్స్‌ థ్రిల్లర్‌ నేటికీ థియేటర్లలో కొనసాగుతోంది. దీంతో హీరో వసంత రవి మీడియాకు విడుదల చేసిన ఓ ప్రకటనలో ఆనందాన్ని వ్యక్తం చేశారు. అందులో చిత్ర యూనిట్‌ రేయింబవళ్లు కష్టపడి రూపొందించిన చిత్రం అశ్విన్స్‌ అని పేర్కొన్నారు.

పలు సమస్యలను ఎదురొడ్డి ఈ చిత్రాన్ని విడుదల చేశామన్నారు. ఇది పరిచయంలేని ముఖాలతో తక్కువ బడ్జెట్లో నిర్మించిన చిత్రమన్నది తెలిసిందేనని, ఇలాంటి చిత్రాలు థియేటర్లో వారానికి పైగా ప్రదర్శించడం సవాల్‌తో కూడిన పని అని తెలిపారు. అలాంటిది ప్రేక్షకుల ఆదరణతో ఈ చిత్రం 25 రోజులు దాటి ప్రదర్శితమవడం సంతోషంగా ఉందన్నారు. ఇంతటి విజయానికి కారణమైన చిత్ర దర్శకుడు తరుణ్‌ తేజా, నిర్మాత బాపినీడు, తమను నమ్మి ఇందులో భాగస్వామ్యం పంచుకున్న ప్రవీణ్‌లకు కతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్నారు.

ఛాలెంజింగ్‌ కథలను, పాత్రలను ఎంపిక చేసుకుని తన పరిధిని పెంచుకుంటూ.. నటనా ప్రతిభను మెరుగుపరుచుకుంటూ మీరందరూ మెచ్చుకునే విధంగా తన చిత్రాలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ఈ చిత్ర విజయం తనకు మరింత బాధ్యతను పెంచిందని వసంత రవి అన్నారు. ఇదిలా ఉంటే రజనీకాంత్‌ కథానాయకుడిగా నటించిన జైలర్‌ చిత్రంలో ఈయన ముఖ్యపాత్రను పోషించారన్నది తెలిసిన విషయమే!

చదవండి: బేబి సినిమాకు వీళ్ల రెమ్యునరేషన్‌ ఇంత తక్కువా?

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)