Breaking News

చావునే చెండాడు ధీరుడు...

Published on Thu, 01/18/2024 - 06:26

వరుణ్‌ తేజ్‌ హీరోగా నటించిన తొలి హిందీ చిత్రం ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’. శక్తి ప్రతాప్‌ సింగ్‌ హడా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మానుషీ చిల్లర్‌ హీరోయిన్‌గా నటించారు. సోనీ పిక్చర్స్‌ ఇంటర్నేషనల్‌ ప్రోడక్షన్స్, రినైసన్స్‌  పిక్చర్స్‌పై సందీప్‌ ముద్దా నిర్మించిన ఈ మూవీ తెలుగు, హిందీలో ఫిబ్రవరి 16న విడుదల కానుంది. మిక్కీ జె. మేయర్‌ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘వందేమాతరం..’ అంటూ సాగే తొలి పాటని అమృతసర్‌లోని వాఘా సరిహద్దులో విడుదల చేశారు.

‘చూడరా సంగ్రామ శూరుడు.. మండె రా మధ్యాహ్న సూర్యుడు.. చావునే చెడాడు ధీరుడు.. నిప్పులు కురిశాడు.. వందేమాతరం..’ అంటూ ఈ పాట సాగుతుంది. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించిన ఈ పాటని తెలుగులో అనురాగ్‌ కులకర్ణి, హిందీలో సుఖ్వీందర్‌ సింగ్‌ ఆలపించారు. ‘‘ఎయిర్‌ ఫోర్స్‌ యాక్షన్‌ అడ్వెంచరస్‌ మూవీగా ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ రూపొందింది. దేశ స్ఫూర్తిని చాటే దేశభక్తి గీతమైన ‘వందేమాతరం..’ని వాఘా సరిహద్దులో విడుదల చేశాం. ఇక్కడ రిలీజ్‌ చేసిన తొలి పాటగా ‘వందేమాతరం..’ చరిత్ర సృష్టించింది’’ అని మేకర్స్‌ తెలిపారు. ఈ పాట ఆవిష్కరణలో వరుణ్‌ తేజ్, మానుషీ చిల్లర్‌తో సహా టీమ్‌ పాల్గొన్నారు.

Videos

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)