Breaking News

పెళ్లి తర్వాత ఆ ప్రశ్నలే ఎక్కువగా వస్తున్నాయి: వరుణ్ తేజ్

Published on Sun, 02/18/2024 - 21:21

మెగా హీరో వరుణ్ తేజ్, మానుషి చిల్లర్‌ జంటగా నటిస్తోన్న చిత్రం ఆపరేషన్ వాలెంటైన్.  ఈ చిత్రానికి శక్తి ప్రతాప్‌ సింగ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఆ సినిమా మార్చిన 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు వరుణ్. అందులో భాగంగానే మల్లారెడ్డి ఇంజినీరింగ్ ఉమెన్స్‌ కాలేజీలో సందడి చేశారు. ఈవెంట్‌లో పాల్గొన్న యాంకర్ సుమ అడిగిన పలు ప్రశ్నలకు వరుణ్ ఆసక్తికర సమాధానాలిచ్చారు. అవేంటో తెలుసుకుందాం. 

పెళ్లి తర్వాత మీ లైఫ్‌లో వచ్చిన మార్పులేంటని యాంకర్‌ సుమ ప్రశ్నించింది. దీనికి వరుణ్ తేజ్ బదులిస్తూ.. 'పెళ్లి తర్వాత ఫోన్‌కాల్స్‌ ఎక్కువగా వస్తున్నాయని.. ఎక్కడికి వెళ్తున్నారంటూ ప్రశ్నలు ఎదురవుతున్నాయని.. కానీ అవన్నీ ప్రేమతోనేనని నవ్వుతూ సమాధానమిచ్చారు. అంతే కాకుండా ఈ ఏడాది వాలెంటైన్‌ డే రోజు లావణ్య ఎలాంటి బహుమతి ఇవ్వలేదన్నారు. ఆ తర్వాత పలువురు విద్యార్థినిలు వరుణ్‌తేజ్‌కు ప్రశ్నలు వేశారు.  నా సినిమా స్క్రిప్టు ఎంపికలో పెద్దనాన్న చిరంజీవినే ఆదర్శంగా తీసుకుంటానని ఓ విద్యార్థిని అడిగిన ప్రశ్నకు ఆన్సరిచ్చారు. అంతే కాకుండా వారు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. 

అనంతరం ఆపరేషన్ వాలెంటైన్‌ గురించి మాట్లాడుతూ.. 'దేశాన్ని రక్షించే మన సైనికుల గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. వాస్తవ పరిస్థితులను చూపించే అవకాశం అరుదుగా వస్తుంది. ఈ సినిమా కంటే ముందు పుల్వామా ఎటాక్‌ గురించి నాకు కొంత అవగాహన ఉంది. ముఖ్యంగా యువతకు ఇలాంటి చిత్రాలు చాలా అవసరం. ఇలాంటి సినిమాలో భాగమవడం నా అదృష్టం. సీరియస్‌ మాత్రమే కాదు.. ఈ చిత్రాన్ని కామెడీ కోణంలోనూ తెరకెక్కించాం. ఇలాంటి తరహాలో చాలా సినిమాలు వచ్చాయి కదా అని అడిగారు. ప్రేమకథా చిత్రాలు, కమర్షియల్‌ సినిమాలు ఎన్నైనా తీస్తున్నప్పుడు రియల్‌ హీరోపై ఎందుకు తీయకూడదని అడిగా. ఈ సినిమా నాకెన్నో జ్ఞాపకాలు ఇచ్చింది. ఈ సినిమా పాటను వాఘా బోర్డర్‌లో విడుదల చేయడం ఆనందాన్నిచ్చింది. ప్రతి ఒక్కరు వాఘా బోర్డర్‌ను సందర్శించండి. ఎందుకంటే యువతకు దేశభక్తి చాలా ముఖ్యం. బీఎస్‌ఎఫ్‌ జవాన్లను కలుసుకోవడం నాకు మంచి అనుభూతినిచ్చింది' అని అన్నారు. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)