Breaking News

'జాక్‌' సినిమాకు 'వరుణ్ తేజ్' సినిమా నష్టాల దెబ్బ

Published on Sat, 04/05/2025 - 11:34

టాలీవుడ్‌ హీరో సిద్ధూ జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda) 'జాక్‌' సినిమా ఏప్రిల్‌ 10న విడుదల కానున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. తాజాగా విడుదలైన ట్రైలర్‌కు అదిరిపోయే రెస్పాన్స్‌ వచ్చింది. సోషల్‌మీడియాలో సిద్ధూ డైలాగ్స్‌ బాగానే వైరల్‌ అవుతున్నాయి. అయితే, సినిమా థియేటర్స్‌లో చూద్దామని ఆశగా ఉన్న ప్రేక్షకులకు నిరాశ ఎదురుకానుంది అంటూ నెట్టింట పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది.  శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్, బాపినీడు నిర్మించిన ఈ చిత్రాన్ని బొమ్మరిల్లు భాస్కర్‌(Bommarillu Bhaskar) దర్శకత్వం వహించారు. ఇందులో వైష్ణవి చైతన్య తొలిసారి ద్విపాత్రాభినయం చేస్తుండటం విశేషం.

జాక్‌కు 'గాండీవధారి అర్జున' చిక్కులు
2023లో విడుదలైన వరుణ్ తేజ్'గాండీవధారి అర్జున'(Gandeevadhari Arjuna) చిత్రాన్ని నిర్మించిన  బీవీఎస్ఎన్ ప్రసాద్‌నే ఇప్పుడు జాక్‌ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అప్పుడు ఆ చిత్రం పెద్ద డిజాస్టర్ కావడంతో చాలామంది నష్టపోయారు. ముఖ్యంగా గోదావరి ప్రాంత డిస్ట్రిబ్యూటర్లు న్యాయం చేయాలంటూ ఫిలిం ఛాంబర్‌లో ఫిర్యాదు చేశారట. గాండీవధారి అర్జున సినిమా విడుదల సమయంలో రికవరబుల్ అడ్వాన్స్ కింద సినిమాను కొన్నామని, అందుకు సంబంధించిన ఆధారాలతో ఫిర్యాదు చేశారట. ఆ సినిమాతో తాము పూర్తిగా మునిగిపోయినట్లు చెప్పుకొచ్చారని సమాచారం. డీల్‌ ప్రకారం తమకు డబ్బులు వెనక్కివ్వలేదని తెలిపిన వారు.. ఆ సెటిల్మెంట్ జరిగే వరకు ‘జాక్’ సినిమాను విడుదల కానివ్వమని పెద్ద పంచాయితీ పెట్టినట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు గాండీవధారి నష్టాలు జాక్‌ను అడ్డుకుంటున్నాయిని నెటిజన్లు తెలుపుతున్నారు.

వరుణ్ తేజ్, సాక్షి వైద్య జంటగా 'గాండీవధారి అర్జున' చిత్రానికి ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించారు.  పూర్తిగా ఫారిన్ బ్యాక్ డ్రాప్‌లో సుమారు రూ. 50 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను  బీవీఎస్ఎన్ ప్రసాద్‌ నిర్మించారు. అయితే, ప్రీరిలీజ్‌ బిజినెస్‌ కేవలం రూ. 17 కోట్లు మాత్రమే చేసింది. ఆపై బాక్సాఫీస్‌ వద్ద రూ. 4 కోట్ల గ్రాస్‌ మాత్రమే రాబట్టినట్లు ఇండస్ట్రీ లెక్కలు చెబుతున్నాయి. దీంతో చాలామంది పంపిణీదారులు ఈ సినిమాతో నష్టపోయారని తెలుస్తోంది. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)