Breaking News

‘మట్కా’తో ప్రామిస్‌ చేసిన వరుణ్‌ తేజ్‌

Published on Sat, 01/20/2024 - 04:44

‘మట్కా’లో వరుణ్‌ తేజ్‌ప్రామిస్‌ చేశారు. ఎవరికి? ఎందుకు? అనేది తెలియాలంటే మాత్రం మరికొన్ని రోజులు ఎదురు చూడక తప్పదు. వరుణ్‌ తేజ్‌ హీరోగా నటిస్తున్న తాజా పీరియాడికల్‌ యాక్షన్‌ ఫిల్మ్‌ ‘మట్కా’. ఈ చిత్రంలో నోరా ఫతేహి, మీనాక్షి చౌదరి హీరోయిన్లు. కరుణ కుమార్‌ దర్శకత్వంలో డా. విజయేందర్‌ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మిస్తున్నారు. శుక్రవారం (జనవరి 19) వరుణ్‌ తేజ్‌ బర్త్‌ డే.

ఈ సందర్భంగా ‘మట్కా’ నుంచి ఓపెనింగ్‌ బ్రాకెట్‌ అంటూ ఓ వీడియోను షేర్‌ చేశారు మేకర్స్‌. ఇందులో వరుణ్‌ తేజ్‌ ప్రామిస్‌’ అంటూ టెలిఫోన్‌లో మాట్లాడటం కనిపిస్తుంటుంది. యావత్‌ దేశాన్ని కదిలించిన వాస్తవ ఘటన ఆధారంగా ‘మట్కా’ కథను రూపొందించారు. 24 ఏళ్ల టైమ్‌ పీరియడ్‌లో (1958–1982) సాగే ఈ కథలో వరుణ్‌ తేజ్‌ నాలుగు విభిన్నమైన గెటప్‌లలో కనిపించనున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో వేసిన ఓ భారీ సెట్‌లో ఈ సినిమా షూటింగ్‌ జరుగుతోంది.

‘‘ఓ గ్యాంబ్లింగ్‌ మాఫియా అధిపతి నేపథ్యంలో ఈ సినిమా కథనం ఉంటుంది (ఈ పాత్ర వరుణ్‌ తేజ్‌ది అని ఊహించ వచ్చు). ఈ చిత్రంలో ఓ గ్యాంగ్‌స్టర్‌ పాత్రలో నవీన్‌ చంద్ర, పోలీసాఫీసర్‌ పాత్రలో పి. రవిశంకర్‌ కనిపిస్తారు. కథ రీత్యా 1950, 1980 నాటి పరిస్థితులను రీ క్రియేట్‌ చేయడంలో దర్శకులు కరుణ కుమార్‌ విజయం సాధించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేస్తాం’’ అని యూనిట్‌ పేర్కొంది. కన్నడ కిశోర్, రవీంద్ర విజయ్, ‘సత్యం’ రాజేశ్, రవిశంకర్, అజయ్‌ ఘోష్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాశ్‌కుమార్‌.  

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)