Breaking News

వరుస ప్లాపుల తర్వాత వరుణ్‌ తేజ్‌ కొత్త సినిమా ప్రకటన

Published on Sun, 01/19/2025 - 14:00

వరుణ్‌ తేజ్‌ పుట్టినరోజు సందర్భంగా తన కొత్త సినిమాను ప్రకటించారు.  దర్శకుడు మేర్లపాక గాంధీతో ఈ చిత్రాన్ని ఆయన చేయనున్నారు. భారీ అంచనాలతో యూవీ క్రియేషన్స్‌, ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంయుక్తంగా దీనిని నిర్మిస్తున్నాయి. ఇండో - కొరియన్‌ హారర్‌ కామెడీ బ్యాక్‌ డ్రాప్‌లో ఈ మూవీ రానుంది.  వరుణ్‌ తేజ్‌ 15వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ మూవీకి ‘కొరియన్‌ కనకరాజు’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారనే టాక్‌ వినిపిస్తోంది. ఈ న్యూ ఏజ్‌ ఎంటర్‌టైన్మెంట్‌ ఫిల్మ్‌లో వరుణ్‌ తేజ్‌ క్యారెక్టర్‌ కొత్తగా ఉంటుందని తెలుస్తోంది. 

రీసెంట్‌గా వరుణ్‌ నటించిన మట్కా చిత్రం భారీ డిజాస్టర్‌ కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై ఆయన ఎక్కువ నమ్మకం పెట్టుకున్నారు. ఎక్స్‌ప్రెస్‌ రాజా, కృష్ణార్జున యుద్ధం, వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌, మాస్ట్రో  వంటి చిత్రాలను మేర్లపాక గాంధీ తెరకెక్కించిన విషయం తెలిసిందే.

వ‌రుణ్‌తేజ్ నటించిన మ‌ట్కా చిత్రం భారీ డిజాస్టర్‌గా మిగిలింది. గతేడాదిలో విడుదలైన ఈ చిత్రం తొలి రోజు ప్రీమియ‌ర్స్ నుంచే నెగెటివ్ టాక్‌ను మూట‌గ‌ట్టుకుంది. పీరియాడిక‌ల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద రూ. 5 కోట్ల వ‌ర‌కు క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన‌ట్లు స‌మాచారం. అయతే, ఈ మూవీ కోసం సుమారు రూ. 20 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. మ‌ట్కా మూవీకి ప‌లాస 1978 ఫేమ్ క‌రుణ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. విజ‌యేంద‌ర్‌రెడ్డి, ర‌జ‌నీ తాళ్లూరి మ‌ట్కా మూవీని ప్రొడ్యూస్ చేశారు. 

ఈ మూవీ కంటే ముందు వ‌రుణ్‌తేజ్ చేసిన గ‌ని, ఆప‌రేష‌న్ వాలెంటైన్‌, గాండీవదారి అర్జున కూడా డిజాస్ట‌ర్స్‌గా నిలిచాయి. ఇలా వరుస సినిమాలతో వరణ్‌ తన అభిమానులను నిరుత్సాహపరుస్తున్నారు. దీంతో మేర్లపాక గాంధీతో చేస్తున్న సినిమాపై అందరూ భారీ అంచనాలు పెట్టుకున్నారు. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)