Breaking News

వరుణ్ సందేశ్- ప్రియాంక జైన్‌ థ్రిల్లర్‌.. ఆసక్తిగా ట్రైలర్

Published on Tue, 12/09/2025 - 19:51

టాలీవుడ్ హీరో వరుణ్‌ సందేశ్‌ ఓటీటీలో ఎంట్రీ ఇస్తున్నాడు. వరుణ్ సందేశ్‌ నటిస్తోన్న లేటెస్ట్‌ వెబ్‌ సిరీస్‌ ‘న‌య‌నం’. ఈ సిరీస్‌ జీ5లో డిసెంబ‌ర్ 19 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ సైకో థ్రిల్ల‌ర్‌ను స్వాతి ప్ర‌కాశ్ డైరెక్ట్ చేశారు. మ‌నుషుల్లోని నిజ స్వ‌భావానికి, ఏదో కావాల‌ని త‌పించే తత్వానికి మ‌ధ్య ఉండే సున్నిత‌మైన అంశాల‌ను ఇందులో చూపించనున్నారు.

తాజాగా ఈ వెబ్ సిరీస్‌ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. 'కన్ను ట్రాన్స్‌మీటర్.. నాలుగు నిమిషాలు వాళ్ల జీవితంలో ఏం జరుగుతుందో నేను చూడగలను' అంటూ వరుణ్ సందేశ్‌ డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమైంది. ట్రైలర్ చూస్తుంటే ఈ సిరీస్‌ను సస్పెన్స్‌తో పాటు సైక‌లాజిక‌ల్ మేసేజ్‌ ఓరియంటెడ్‌గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ సిరీస్‌లో బిగ్‌బాస్‌ బ్యూటీ ప్రియాంక జైన్ కీలక పాత్రలో నటించింది. డాక్ట‌ర్ న‌య‌న్ పాత్ర‌లో వ‌రుణ్ సందేశ్ కనిపించనున్నారు. ఈ వెబ్‌ సిరీస్‌లో ఆరు ఎపిసోడ్స్ ఉండనున్నాయి. ఈనెవల 19 నుంచి జీ5 వేదికగా ఈ వెబ్ సిరీస్‌ స్ట్రీమింగ్ కానుంది.

 

Videos

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

ముళ్ల కంచెలతో దిగ్బంధం.. పోలీస్ Vs వైఎస్ఆర్ సీపీ

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)