Breaking News

కొత్తింట్లో అడుగుపెట్టిన వరుణ్ సందేశ్-వితిక

Published on Tue, 09/23/2025 - 11:35

తెలుగు హీరో, బిగ్‌బాస్ ఫేమ్ వరుణ్ సందేశ్ కొత్త ఇంట్లోకి అడుగుపెట్టేశాడు. కొన్నిరోజుల క్రితం తమ సొంతింటి కల నెరవేరిందని వరుణ్ భార్య వితికా షేరు చెప్పుకొచ్చింది. తన భర్త పుట్టినరోజు సందర్భంగా ఈ ఇంటిని గిఫ్ట్‌గా ఇస్తున్నట్లు చెబుతూ ఓ వీడియో రిలీజ్ చేసింది కదా. ఇప్పుడు ఈ జంట.. సందడిగా గృహప్రవేశం చేశారు. పలువురు సెలబ్రిటీలు ఈ వేడుకలో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

హ్యాపీడేస్, కొత్తబంగారులోకం సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వరుణ్ సందేశ్.. తర్వాత కాలంలో తనతో పాటు నటించిన వితికా షేరుని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీళ్లిద్దరూ బిగ్‌బాస్ 3వ సీజన్‌లో జంటగా పాల్గొన్నారు. ఆ తర్వాత సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. ఇకపోతే కొన్నిరోజుల క్రితం తను కొత్త ఇల్లు తయారైందని చెప్పి వితికా షేరు పోస్ట్ పెట్టింది.

(ఇదీ చదవండి: 'కాంతార' షూట్‌లో 4-5 సార్లు నేను చనిపోయేవాడిని: రిషభ్ శెట్టి)

'సొంత ఇల్లు ఉండాలనేది నా కల, అందుకే ఈ ఇంటి కోసం ఎన్నో రోజుల నుంచి ఎదురుచూశాను. ఇన్నిరోజులకు నా కల నెరవేరింది' అని వితికా షేరు చెప్పింది. ఇప్పుడు భర్తతో కలిసి గృహప్రవేశం చేసింది. ఈ వేడుక కోసం అమెరికాలో ఉంటున్న వరుణ్ తల్లిదండ్రులు ఇక్కడికి వచ్చారు. కుటుంబమంతా కలిసి తొలుత తిరుమల దర్శనం చేసుకున్నారు. తాజాగా సోమవారం ఉదయం కొత్త ఇంట్లో అడుగుపెట్టారు. పూజ, హోమం లాంటి కార్యక్రమాలు చేశారు.

ఈ గృహప్రవేశానికి బిగ్‌బాస్ ఫేమ్ పునర్నవి, శివజ్యోతి, హిమజ తదితరులు వచ్చారు. అలానే మెగాడాటర్ నిహారిక కూడా విచ్చేసింది. వితికా షేరుకి నిహారిక బెస్ట్ ఫ్రెండ్. ఈ క్రమంలో ఇన్ స్టాలో వరుణ్-వితిక కొత్త ఇంటి గురించి ఈమె పోస్ట్ కూడా పెట్టి కంగ్రాట్స్ చెప్పింది.

(ఇదీ చదవండి: నామినేషన్స్‌లో ఆరుగురు.. రీతూని మోసం చేసిన పవన్)

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)