ఫస్ట్‌ లుక్‌ చూసి ఆశ్చర్యపోతారు: వరుణ్‌ సందేశ్‌

Published on Wed, 07/03/2024 - 00:16

‘‘నా 17 ఏళ్ల కెరీర్‌లో చేయని ఒక డిఫరెంట్‌ మూవీ ‘విరాజి’. ఈ చిత్రంలో ఓ క్రేజీ పాత్ర చేస్తున్నాను. ఈ నెల 10న విడుదల చేయనున్న ‘విరాజి’ ఫస్ట్‌ లుక్‌ చూడగానే అందరూ ఆశ్చర్యపోతారు. మీ అందరికీ తప్పకుండా నచ్చే సినిమా అవుతుంది. ఈ మూవీ రిలీజ్‌ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను’’ అని హీరో వరుణ్‌ సందేశ్‌ అన్నారు. ఆయన హీరోగా నటించిన చిత్రం ‘విరాజి’. ఈ చిత్రంతో ఆద్యంత్‌ హర్ష దర్శకుడిగా పరిచయమవుతున్నారు.

మహా మూవీస్‌తో కలిసి ఎమ్‌ 3 మీడియా బ్యానర్‌పై మహేంద్రనాథ్‌ కూండ్ల నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 2న రిలీజ్‌ కానుంది. మంగళవారం జరిగిన ‘విరాజి’ టైటిల్‌ ప్రకటన కార్యక్రమంలో ఆద్యంత్‌ హర్ష మాట్లాడుతూ– ‘‘విరాజి’కి చాన్స్‌ ఇచ్చిన మా మూవీ ప్రాజెక్ట్‌ హెడ్‌ సుకుమార్‌ కిన్నెర, నిర్మాత మహేంద్రగారు, వరుణ్‌ సందేశ్‌లకు కృతజ్ఞతలు’’ అన్నారు. ‘‘వరుణ్‌ సందేశ్‌ని కొత్త అవతారంలో చూపించే చిత్రమిది. మాలాంటి కొత్తవాళ్లు ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే ప్రేక్షకుల సపోర్ట్‌ కావాలి’’ అన్నారు మహేంద్రనాథ్‌ కూండ్ల. సంగీతదర్శకుడు ఏబీ నెజర్‌ పాల్‌ (ఏబీ), నటీనటులు ప్రమోదిని, రఘు కారుమంచి, ఫణి తదితరులు పాల్గొన్నారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)