Breaking News

వరుణ్‌ సందేశ్‌ ‘కానిస్టేబుల్’ మూవీ రివ్యూ

Published on Sat, 10/11/2025 - 12:34

వరుణ్ సందేశ్, మధులిక వారణాసి జంటగా నటించిన చిత్రం ‘కానిస్టేబుల్’. బలగం జగదీష్ నిర్మాతగా ఆర్యన్ సుభాష్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ మూవీ ఈ వారం ఆడియెన్స్ ముందుకు వచ్చింది. ఈ మూవీలో కానిస్టేబుల్‌గా వరుణ్ సందేశ్ ఏ మేరకు ఆకట్టుకున్నాడు? అసలు ఈ మూవీ కథ ఏంటి? అన్నది చూద్దాం..

కథేంటంటే..
మోకిలా మండలంలోని శంకరపల్లి ఊర్లో వరుసగా హత్యలు జరుగుతుంటాయి. ఆడ, మగ అని తేడా లేకుండా జరుగుతున్న ఈ సీరియల్ కిల్లింగ్స్ పోలీసులకు పెద్ద ఛాలెంజింగ్‌గా మారుతుంది. అయితే ఈ ఊరి పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా కాశీ (వరుణ్ సందేశ్) పని చేస్తుంటాడు. ఈ సీరియల్ కిల్లింగ్స్‌లో కాశీ మేనకోడలు కీర్తి (నిత్య శ్రీ) కూడా బలి అవుతుంది. మరి ఈ సీరియల్ కిల్లింగ్స్ వెనకాల ఉన్నది ఎవరు? కాశీ ఆ కిల్లర్‌ను పట్టుకుంటాడా? ఎవరిని అనుమానించినా సరే చివరకు వాళ్లు కూడా చనిపోతుంటారు? అసలు వీటన్నంటి వెనకాల ఉన్నది ఎవరు? చివరకు ఏం జరిగింది? అన్నది తెలియాలంటే సినిమాను చూడాల్సిందే.

ఎలా ఉందంటే..
సీరియల్ కిల్లర్స్, క్రైమ్ స్టోరీలకు ఓ ఫార్మూలా ఉంటుంది. చాలా మంది ఆ ఫార్మూలాను వాడుకుని కథను అల్లుకుంటారు. కానీ కానిస్టేబుల్ విషయంలో మాత్రం అంతా కొత్తగా, డిఫరెంట్‌గా ఉంటుంది. ఆడియెన్స్ ఊహించి ఏదీ కూడా తెరపై జరగదు. ప్రతీ ఒక్క చోట ప్రేక్షకుడ్ని సర్ ప్రైజ్ చేసుకుంటూ వెళ్తుంది.

ఫస్ట్ హాఫ్ అంతా కూడా సీరియల్ కిల్లింగ్స్, కొందరి మీద అనుమానం వచ్చేలా సీన్లను చూపించడం, హీరో ఇంట్లోనే విషాదం జరగడం వంటి సీన్లతో సాగుతుంది. ఇంటర్వెల్‌కు ఇచ్చే ట్విస్ట్ బాగుంటుంది. ఇక సెకండాఫ్‌లో అసలు కథ రివీల్ అవుతుంది. ఫ్లాష్ బ్యాక్ కూడా ఓకే అనిపిస్తుంది. క్లైమాక్స్ అయితే ఊహకు భిన్నంగా ఉంటుంది. అలా మొత్తానికి ఓ మంచి క్రైమ్, థ్రిల్లర్ మూవీ చూసిన ఫీలింగ్ అయితే కలుగుతుంది.

ఎవరెలా చేశారంటే..
ఈ చిత్రంలో కాశీ పాత్రలో వరుణ్ సందేశ్ ఆకట్టుకుంటాడు. వరుణ్ సందేశ్‌కు ఇలాంటి పాత్ర చాలా కొత్త. ఈ మూవీలో వరుణ్ సందేశ్ లుక్స్, యాక్టింగ్ ఇలా అన్నీ కూడా ఆడియెన్స్‌కు సర్ ప్రైజింగ్‌గా ఉంటాయి. హీరోయిన్ మధులిక పాత్ర కూడా మెప్పిస్తుంది. యాక్టింగ్‌‌కు ఓ మోస్తరుగా స్కోప్ దక్కిందని చెప్పుకోవచ్చు. ఇక భవ్య శ్రీ, నిత్య శ్రీ పాత్రలు కూడా ఆకట్టుకుంటాయి. మిగిలిన పాత్రల్లో అందరూ తమ పరిధి మేరకు నటించారు. అసలు ట్విస్ట్ ఏంటి? విలన్ ఎవరన్నది మాత్రం సినిమాలో చూస్తేనే కిక్ వస్తుంది. సాంకేతికంగా సినిమా పర్వాలేదు.  ఇలాంటి సీరియల్ కిల్లింగ్ స్టోరీలకు ఆర్ఆర్ చాలా ఇంపార్టెంట్. ఇందులోనూ మంచి ఆర్ఆర్ ఉంటుంది. షైక్ హజారా కెమెరా కూడా సీన్లకు తగ్గట్టుగా మూడ్‌ను రిఫ్లెక్ట్ చేసేలా ఉంటుంది. మాటలు, పాటలు పర్వాలేదనిపిస్తాయి.ఎడిటింగ్, ఆర్ట్, ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగానే ఉన్నాయి.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)