Breaking News

మోడల్‌ను ఎత్తుకుని ముద్దుపెట్టిన హీరో, సిగ్గు లేదంటూ ట్రోలింగ్‌!

Published on Sun, 04/02/2023 - 15:31

రిలయన్స్‌ అధినేత ముఖేవ్‌ అంబానీ సతీమణి, రిలయన్స్‌ ఫౌండేషన్‌ చైర్‌పర్సన్‌ నీతా అంబానీ తన డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ నీతా ముఖేశ్‌ అంబానీ కల్చరల్‌ సెంటర్‌(ఎన్‌ఎంఏసీసీ)ని ఘనంగా ప్రారంభించిన విషయం తెలిసిందే! ముంబైలో జరిగిన ఈ కార్యక్రమానికి వ్యాపారవేత్తలే కాకుండా సినీ, క్రీడా ప్రముఖులు సైతం హాజరై సందడి చేశారు. ఈ కల్చర్‌ సెంటర్‌ ప్రారంభోత్సవ రెండో రోజు కూడా పలువురు తారలు డ్యాన్స్‌ పర్ఫామెన్స్‌లతో స్టేజీని హోరెత్తించారు.

ఈ క్రమంలో యంగ్‌ హీరో వరుణ్‌ ధావన్‌ హాలీవుడ్‌ మోడల్‌ గిగి హ్యాడిడ్‌ను ఎత్తుకుని ఆమె బుగ్గపై ముద్దు పెట్టాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారగా చాలామంది హీరో వైఖరిని తప్పుపడుతూ కామెంట్లు చేస్తున్నారు. 'గిగి చాలా అసౌకర్యంగా ఫీలైంది', 'అతను అలా చేసి ఉండాల్సింది కాదు', 'బాలీవుడ్‌కు సిగ్గులేకుండా పోతోంది' అంటూ ట్రోల్‌ చేస్తున్నారు.

తాజాగా ఈ ట్రోలింగ్‌పై వరుణ్‌ ధావన్‌ స్పందించాడు. 'మిమ్మల్ని మేల్కొపాలనుకుంటున్నాను. గిగిని స్టేజీపై ఎత్తుకుని ముద్దుపెట్టడం అనేది మేము ముందే ప్లాన్‌ చేసుకున్నాం. కాబట్టి ఇక మామీద రచ్చ చేయడం ఆపి మీ పని చూసుకోండి' అని స్ట్రాంగ్‌ కౌంటరిచ్చాడు. దీనిపై వరుణ్‌ ఫ్యాన్స్‌ స్పందిస్తూ.. అనవసరంగా మా హీరో మీద పడి ఏడ్చారు కదరా అని కామెంట్లు చేస్తున్నారు.

కాగా ఎన్‌ఎంఏసీసీ లాంఛింగ్‌ కార్యక్రమంలో ప్రియాంక - రణ్‌వీర్‌ సింగ్‌, షారుక్‌ ఖాన్‌, వరుణ్‌ ధావన్‌, రణ్‌వీర్‌ సింగ్‌ తమ డ్యాన్సులతో స్టేజీని దద్దరిల్లిపోయేలా చేశారు. రష్మిక మందన్నా, ఆలియా భట్‌ అయితే నాటునాటు స్టెప్పులతో అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. హాలీవుడ్‌ సెలబ్రిటీలు లా రోచ్‌, టామ్‌ హాలాండ్‌, జెండాయా సహా పలువురు తారలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Videos

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?