Breaking News

ముంబైలో చాలామంది హీరోలు కీర్తి ఫోన్‌ నెంబర్‌ అడిగారు: వరుణ్‌ ధావన్‌

Published on Tue, 12/24/2024 - 19:08

బేబీ జాన్‌ సినిమాతో కీర్తి సురేశ్‌ (Keerthy Suresh) బాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తోంది. బుధవారం (డిసెంబర్‌ 25)న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. పెళ్లయిన రెండు రోజులకే పర్సనల్‌ లైఫ్‌ను పక్కనపెట్టేసి సినిమా ప్రమోషన్స్‌లో మునిగిపోయింది. తాజాగా ఈ బ్యూటీ బేబీ జాన్‌ (Baby John Movie) హీరో వరుణ్‌ ధావన్‌తో కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది.

ఎప్పుడూ పెళ్లి టాపికే..
ఈ సందర్భంగా వరుణ్‌ ధావన్‌ (Varun Dhawan) మాట్లాడుతూ.. మేము ఎప్పుడూ పెళ్లి గురించే మాట్లాడుకునేవాళ్లం. నాకేమో పెళ్లయిపోయింది. తనేమో పెళ్లికి రెడీ అవుతోంది.. కాబట్టి ఈ హడావుడి గురించే ఎప్పుడూ కబుర్లాడుకునేవాళ్లం. వివాహమయ్యాక నేను మంచి ఇల్లాలుగా ఉంటాననేది. సినిమాలో తను ఎలాంటి భార్యగా నటించిందో చూడండి.. తనకు వైఫ్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డు ఇచ్చేయాలంటారు. నిజానికి కీర్తి ఎంతోమంది మనసులను ముక్కలు చేసింది. 

(చదవండి: కోహ్లి నన్ను బ్లాక్‌ చేశాడు, ఎందుకో ఇప్పటికీ అర్థం కావట్లేదు: సింగర్‌)

అదే బెటర్‌ అనిపించింది!
తను ప్రేమలో ఉన్న విషయం ఏళ్ల తరబడి ఎవరికీ తెలియదు అన్నాడు. ఇంతలో కీర్తి మధ్యలో కలుగజేసుకుంటూ నాకు బాగా దగ్గరైనవాళ్లకు తెలుసు. అట్లీ, అతడి భార్య, అలాగే వరుణ్‌తో సినిమా చేస్తున్నప్పటి నుంచి తనకూ తెలుసు. అలాగే నా క్లోజ్‌ ఫ్రెండ్స్‌కు కూడా తెలుసు. ఈ విషయాన్ని బయటకు తెలియనివ్వకపోడమే బెటర్‌ అనిపించింది అని చెప్పుకొచ్చింది.

చాలామంది హీరోలు తన నెంబర్‌ అడిగారు
వరుణ్‌ మాట్లాడుతూ.. మేము ముంబైలో షూటింగ్‌ చేస్తున్నప్పుడు చాలామంది తన ఫోన్‌ నెంబర్‌ పంపించమని మెసేజ్‌ చేశారు. ఎంతో మంది హీరోలు తన నెంబర్‌ అడిగారు. తనను జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నాది. అందుకే ఎవరికీ నెంబర్‌ ఇవ్వకుండా తనను కాపాడాను. చివరకు నా బేబీ.. నాకే వదినగా మారిపోయింది అని వ్యాఖ్యానించాడు.

చదవండి: Pushpa 2 Movie: దమ్ముంటే పట్టుకోరా..

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)