Breaking News

కేవలం రూ. 2500 కోసం రోడ్డుపైనే డ్యాన్స్‌ చేశా: వరలక్ష్మి శరత్‌ కుమార్‌

Published on Mon, 03/10/2025 - 07:05

కోలీవుడ్‌ ప్రముఖ నటుడు శరత్‌ కుమార్‌ వారసురాలు నటి వరలక్ష్మి శరత్‌ కుమార్‌ సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే, ఈమె తండ్రి సపోర్ట్‌ లేకుండానే దక్షిణాదిలో ప్రముఖ నటిగా ఎదిగారు అన్నది వాస్తవం. నటి నయనతార భర్త విఘ్నేష్‌ శివన్‌ దర్శకత్వంలో రూపొందిన పోడాపోడి చిత్రం ద్వారా కథానాయకిగా ఎంట్రీ ఇచ్చిన నటి వరలక్ష్మి . శంభో కథానాయకుడిగా నటించిన ఆ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో ఆమె‌కు వెంటనే మరో అవకాశం రాలేదు. అలాంటి సమయంలో దర్శకుడు బాల తాను దర్శకత్వం వహించిన తారైతప్పట్టై చిత్రంలో నటించే అవకాశాన్ని కల్పించారు. ఆ చిత్రం నటి వరలక్ష్మి శరత్‌ కుమార్‌ మంచి పేరును తెచ్చిపెట్టింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో కథానాయకిగా నటించింది. అయితే, హీరోయిన్‌గా టాప్‌ స్టార్‌ ఇమేజ్‌ ని మాత్రం ఇప్పటికీ పొందలేకపోయింది. 

కానీ, ఆమె కథానాయకిగానే కాకుండా ప్రతి కథానాయకిగా కూడా నటిస్తూ విలక్షణ నటిగా గుర్తింపు పొందింది. అలా తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం తదితర భాషల్లో నటిస్తూ దక్షిణాది నటిగా ముద్ర వేసుకుంది. డేరింగ్‌ నటిగా పేరు తెచ్చుకున్న వరలక్ష్మి శరత్‌ కుమార్‌ 39 ఏళ్ల వయసులో గత ఏడాది తన చిరకాల మిత్రుడు నికోలాయ్‌ సచ్‌దేవ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వివాహ తర్వాత తన భర్తతో పాటుగా కనిపిస్తున్న ఆమె ఇటీవల ఒక డాన్స్‌ కార్యక్రమంలో పాల్గొంది. ఆ డాన్స్‌ కార్యక్రమంలో ముగ్గురు పిల్లలకు తల్లి అయిన మరో మహిళ కూడా పాల్గొంది. తనదైన స్టెప్పులతో అదరగొట్టేసింది. ఆమె టాలెంట్‌ను చూసిన వరలక్ష్మీ ఫిదా అయిపోయింది. అయితే, మ్యూజిక్‌ వినగానే తనకు  డాన్స్‌ చేయాలనిపిస్తుందని ఆ మహిళ తెలిపింది. 

దీంతో నటి వరలక్ష్మి శరత్‌ కుమార్‌ మాట్లాడుతూ తాను ఇప్పటి వరకు ఎవరికీ చెప్పని ఒక రహస్యాన్ని ఈ వేదికపై చెబుతానని పేర్కొంది. గతంలో తాను కూడా ఒక్కోసారి  రోడ్డుపైనే డాన్స్‌ చేసిన సంర్భాలను గుర్తుచేసుకుంది. తాను సినీ రంగ ప్రవేశం చేయకముందు 2500 రూపాయల కోసం మొట్టమొదటిసారిగా ఒక షో కోసం రోడ్‌లో డాన్స్‌ చేశానని చెప్పింది. రోడ్డుపై డాన్స్‌ చేయడం ఎవరూ తప్పుగా భావించవద్దని నటి వరలక్ష్మి శరత్‌ కుమార్‌ పేర్కొంది.  
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)