Breaking News

నీదీ నాది ఒకే కథ.. బంధువులే అసభ్యంగా.. ఏడ్చేసిన వరలక్ష్మి శరత్‌కుమార్‌

Published on Sat, 03/22/2025 - 12:39

హీరోయిన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా, విలన్‌గా.. ఎలాంటి పాత్రలనైనా ఇట్టే చేయగలదు నటి వరలక్ష్మి శరత్‌కుమార్‌ (Varalaxmi Sarathkumar). సీనియర్‌ నటుడు శరత్‌కుమార్‌ కూతురైన వరలక్ష్మి.. పోడాపొడి (2012) సినిమాతో కథానాయికగా వెండితెరకు పరిచయమైంది. నిజానికి ఈ సినిమాకంటే ముందే ఆమెకు శంకర్‌ 'బాయ్స్‌' మూవీలో ఆఫర్‌ వచ్చింది. కానీ తండ్రి వద్దనడంతో మంచి అవకాశాన్ని వదులుకుంది.

సౌత్‌లో విలక్షణ నటిగా గుర్తింపు
అయినప్పటికీ వరుస ఆఫర్లు వస్తూనే ఉండటంతో కాదనలేకపోయింది. అలా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఎన్నో హిట్‌ సినిమాల్లో నటించింది. తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో నటించింది. తెలుగులో తెనాలి రామకృష్ణ బిఎ. బిఎల్‌. నాంది, క్రాక్‌, యశోద, వీర సింహా రెడ్డి, ఏజెంట్‌, హను-మాన్‌, కోట బొమ్మాళి ఐపీఎస్‌, శబరి వంటి పలు చిత్రాల్లో నటించింది.

వెండితెర.. బుల్లితెర
ఓపక్క వెండితెరపై బిజీగా ఉంటూనే మరోపక్క బుల్లితెరపైనా సందడి చేస్తోంది. డ్యాన్స్‌ జోడీ డ్యాన్స్‌ రీలోడెడ్‌ 3 (తమిళ) షోలో జడ్జిగా వ్యవహరిస్తోంది. తాజాగా ఈ షో నుంచి ఓ ప్రోమో రిలీజైంది. అందులో ఓ కంటెస్టెంట్‌ అద్దం ముందు నిలబడి తనకు ఎదురైన చేదు అనుభవాన్ని బయటపెట్టింది. మన జీవితంలో టర్నింగ్‌ పాయింట్‌ వచ్చినప్పుడు కుటుంబమే మద్దతుగా నిలబడుతుందంటారు. కానీ నా జీవితంలో మాత్రం కుటుంబం, బంధువులెవరూ నాకు సాయంగా నిలబడలేదు. పైగా నన్ను తిడుతూ వేధించారు, టార్చర్‌ పెట్టారు అంటూ ఏడ్చేసింది. 

నీది నాదీ ఒకే కథ
అది విన్న వరలక్ష్మి.. నీ బాధ నేను అర్థం చేసుకోగలను. మా అమ్మానాన్న పనిలో బిజీగా ఉండటం వల్ల చిన్నప్పుడు నన్ను ఇంటి దగ్గరే వదిలేసి వెళ్లిపోయేవారు. నన్ను చూసుకోమని బంధువులకు అప్పజెప్పేవారు. అలా ఓసారి నా ఇంట్లోనే ఐదారుగురు మంది నాపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. అసభ్యంగా తాకారు. నీదీ నాదీ ఒకే కథ.. అంటూ కంటెస్టెంట్‌ను పట్టుకుని ఒక్కసారిగా ఏడ్చేసింది.  దయచేసి తల్లిదండ్రులు పిల్లలకు గుడ్‌ టచ్‌, బ్యాడ్‌ టచ్‌ నేర్పించాలని వరలక్ష్మి కోరింది.

చదవండి: లూసిఫర్‌2: 'మోహన్‌లాల్‌' రెమ్యునరేషన్‌పై పృథ్వీరాజ్‌ కామెంట్స్‌

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)