Breaking News

Varalaxmi Sarathkumar: ప్రియుడితో తొలిసారి విహారయాత్రకు వెళ్లిన బ్యూటీ

Published on Sun, 03/31/2024 - 14:36

వరలక్ష్మీ శరత్‌కుమార్‌.. లేడీ విలన్‌, సహాయ నటిగా వైవిధ్యభరితమైన పాత్రలు చేస్తూ సినీప్రియుల్ని మెప్పిస్తోంది. రీసెంట్‌గా హనుమాన్‌, కోట బొమ్మాళి పీఎస్‌ చిత్రాలతో మెప్పించింది. శరత్‌కుమార్‌ వారసురాలిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆమె సరైన పాత్రలు ఎంచుకుంటూ రాణిస్తుంది. త్వరలో ఆమె పెళ్లి పీటలెక్కబోతుందనే విషయం తెలిసిందే. 

ప్రముఖ గ్యాలరిస్ట్‌ నికోలయ్‌ సచ్‌దేవ్‌తో వరలక్ష్మీ శరత్‌కుమార్‌ నిశ్చితార్థం కొద్దిరోజుల క్రితం జరిగింది. ముంబయి వేదికగా జరిగిన ఈ వేడుకలో కుటుంబసభ్యులు, అతి కొద్ది మంది స్నేహితులు మాత్రమే పాల్గొన్నారు. నిశ్చితార్థం జరిగిన తర్వాత తొలిసారి కాబోయే భర్తతో సరదాగా విదేశాలకు విహారయాత్రకు వెళ్లింది. ఇద్దరూ జంటగా థాయ్‌లాండ్ వెళ్లి అక్కడ సేద తీరుతున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలను వరలక్ష్మీ శరత్‌కుమార్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. ‍ప్రస్తుతం అవి నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

నికోలయ్‌ సచ్‌దేవ్‌ ముంబయికి చెందిన వ్యాపారవేత్త. ఆర్ట్‌ గ్యాలరీలను నిర్వహిస్తుంటారు. ఆన్‌లైన్‌ వేదికగానూ వివిధ రకాల పెయింటింగ్‌లు, కళాకృతులను విక్రయిస్తుంటారు. నికోలయ్‌, వరలక్ష్మీలకు 14ఏళ్లుగా పరిచయం ఉంది. ప్రస్తుతం ఇద్దరూ తమ వృత్తిగత జీవితాల్లో బిజీగా ఉన్నారు. దంతో వచ్చే ఏడాది వీరి వివాహం జరిగే అవకాశం ఉందని కొందరు చెబుతున్నారు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)