Breaking News

నాన్న వల్ల వచ్చిన అవకాశాలు పోయాయి : వరలక్ష్మీ శరత్‌కుమార్‌

Published on Tue, 05/23/2023 - 07:12

చాలెంజింగ్‌ పాత్రలకు కేరాఫ్‌ నటి వరలక్ష్మి శరత్‌ కుమార్‌. ఈమె సుప్రీమ్‌ స్టార్‌ శరత్‌ కుమార్‌ వారసురాలు అన్న విషయం తెలిసిందే. అయితే స్వశక్తితోనే నటిగా ఎదిగి తనకంటూ ఒక ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు. ఈమె రాకింగ్‌ నటన ప్రేక్షకులను థ్రిల్లింగ్‌కు గురి చేస్తుంది. నాయకి, ప్రతినాయకి ఇలా ఏ తరహా పాత్రకైనా రెడీ అంటారు. కథానాయకిగా రంగ ప్రవేశం చేసినా, ప్రతినాయకిగానే ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్నారు.

విఘ్నేశ్‌ శివన్‌ దర్శకత్వంలో శింబుకు జంటగా పోడాపొడి చిత్రంతో కథానాయకిగా పరిచయం అయిన వరలక్ష్మి శరత్‌ కుమార్‌ ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించకపోవడంతో తదుపరి అవకాశాల కోసం కొంతకాలం ఎదురు చూడాల్సి వచ్చింది. అలా బాలా దర్శకత్వంలో నటించిన తారై తప్పటై చిత్రంలో నటనతో సినీ పరిశ్రమ దృష్టిని తనవైపు తిప్పుకున్నారు. ఆపై వరలక్ష్మి నటిగా వెనక్కు తిరిగి చూసుకునే అవకాశం రాలేదు. ముఖ్యంగా నటుడు విజయ్‌ కథానాయకుడిగా నటించిన సర్కార్‌, విశాల్‌ హీరోగా నటించిన సండై కోళీ 2 వంటి చిత్రాల్లో ప్రతి నాయకిగా తనదైన శైలిలో అదరగొట్టారు. చదవండి: శరత్‌బాబు-రమాప్రభ లవ్‌స్టోరీ వెనుక ఇంత కథ నడిచిందా?

ఆ తర్వాత ఈమె ఎక్కువగా ఆ తరహా పాత్రల్లోనే నటిస్తున్నారు. మధ్య మధ్యలో కథానాయిక పాత్రలనూ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. అలా దశాబ్దం పాటుగా తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో నటిస్తూ బహుభాషా నటిగా రాణిస్తున్నారు. ఇటీవల ఈమె ఒక భేటీలో పేర్కొంటూ శంకర్‌ దర్శకత్వం వహించిన బాయ్స్‌ చిత్రంలో జెనీలియా పాత్రలో తాను నటించాల్సి ఉందని చెప్పారు.

దర్శకుడు శంకర్‌ నుంచి తనకు పిలుపు వచ్చిందన్నారు. ఆడిషన్‌, స్క్రీన్‌ టెస్ట్‌ కూడా జరిగిందన్నారు. ఆ చిత్రంలో నటించడానికి చాలా ఆసక్తిగా ఉన్న సమయంలో తాను నటించడానికి తన తండ్రి అనుమతించలేదని చెప్పారు. ఆ తర్వాత బాలాజీ శక్తి వేల్‌ దర్శకత్వం వహించిన సూపర్‌ హిట్‌ చిత్రంలోనూ కథానాయికగా నటించే అవకాశం వచ్చిందని తెలిపారు. దాన్ని నాన్న వద్దన్నారని చెప్పారు. ముందు చదువు పూర్తి చెయ్యి ఆ తర్వాత నటన గురించి ఆలోచిద్దామని చెప్పారన్నారు. అలా తన తండ్రి వల్ల చాలా అవకాశాలు మిస్‌ అయ్యానని వరలక్ష్మి శరత్‌ కుమార్‌ పేర్కొన్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)