Breaking News

మా నాన్న రియల్‌ హీరో: వరలక్షి శరత్‌ కుమార్‌

Published on Fri, 07/15/2022 - 09:15

పాన్‌ ఇండియా నటుడు శరత్‌కుమార్‌ను అభిమానులు సుప్రీం హీరో అంటారు. తమిళ సినిమాలో కథానాయకుడిగా ఎన్నో విలక్షణ పాత్రలు చేసిన ఈయన ఆ తరువాత నటనకు అవకాశం ఉన్న ప్రధాన పాత్రల్లో నటించడానికి కూడా వెనుకాడడం లేదు. అయితే శరత్‌కుమార్‌ ఇప్పటికీ హీరోనే. తమిళం, తెలుగు, మలయాళం ఇలా పలు భాషల్లో పలు రకాల పాత్రలు పోషిస్తూ బిజీగా ఉన్నారు. మరో పక్క ఓ రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా కూడా కొనసాగుతున్నారు. అలాంటి ఈ బహుముఖ ప్రజ్ఞాశాలి గురువారం తన 69వ పుట్టినరోజును జరుపుకున్నారు.

చదవండి: ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్‌కు హైకోర్టులో ఊరట  

ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు ఈయనకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఆయన వారసురాలు వరలక్ష్మి శరత్‌కుమార్‌ కూడా తండ్రికి తగ్గ తనయగా పేరు తెచ్చుకున్నారు. ఆమె హీరోయిన్‌గా మాత్రమే కాదు పాత్ర ప్రాధాన్యత ఉన్న రోల్స్‌ పోషిస్తూ విలక్షణ నటిగా రాణిస్తున్నారు. ఇక గురువారం తన తండ్రి పుట్టినరోజు సందర్భంగా వరలక్ష్మి శుభాకాంక్షలు తెలుపుతూ ఓ వీడియో విడుదల చేసింది. అందులో ‘వయసు అనేది ఒక నంబరు మాత్రమే అని మీరు నిరూపించారు.. మాకు మాత్రమే కాకుండా మీ చుట్టూ ఉన్న ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఐ లవ్‌ యూ డాడీ..నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా అవుతోంది. 

Videos

జగన్ ఫోటో తొలగింపు.. టీడీపీ నేతలపై గోరంట్ల మాధవ్ ఫైర్

25 వేల మంది ఆధారపడి ఉన్నారు వాళ్ల కుటుంబాల పరిస్థితి ఏంటి

హార్వర్డ్ యూనివర్సిటీపై మరోసారి ట్రంప్ సర్కారు కొరడా

టీడీపీలో ఎమ్మెల్యేగా ఉన్నందుకు సిగ్గు పడుతున్న.. బండారు సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు

మై డియర్ డాడీ.. కేసీఆర్ కు కవిత సంచలన లేఖ

Big Question: బాబుకు బాదుడే బాదుడు.. అతిపెద్ద కుంభకోణం

ఎల్లోమీడియాను ఉతికి ఆరేసిన వైఎస్ జగన్

తిరుమలలో మరో అపచారం

ఈడీపై సుప్రీం ఆగ్రహం

కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డిపై టీడీపీ సీరియస్ నేతల ఫైర్

Photos

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

శిల్పకళా వేదిక : మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫినాలే..అందాల భామల సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘థగ్‌ లైఫ్‌’ చిత్రం మీడియా మీట్‌ (ఫొటోలు)

+5

విజయవాడ : వైభవంగా హనుమాన్ జయంతి శోభాయాత్ర (ఫొటోలు)

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)