Breaking News

నటి వనితా విజయ్‌ కుమార్‌ మాజీ భర్త కన్నుమూత

Published on Sun, 04/30/2023 - 12:42

నటి వనితా విజయ్‌ కుమార్‌ మాజీ భర్త, విజువల్‌ ఎఫెక్ట్స్‌ డైరెక్టర్‌ పీటర్‌ పాల్‌ కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం (ఏప్రిల్‌ 29న) చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు. ఈ సందర్భంగా వనితా విజయ్‌ కుమార్‌ సోషల్‌ మీడియా వేదికగా భావోద్వేగ పోస్ట్‌ షేర్‌ చేసింది.

'సాయం చేసేవారికి దేవుడు తప్పకుండా సాయం చేస్తాడని మా అమ్మ చెప్పింది. ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం. నాలుగు రోడ్ల కూడలిలో ఉన్నప్పుడు ఎటువైపు వెళ్లాలనేది ఎటువెళ్లాలనేది ఎవరికి వారే నిర్ణయించుకుంటారు. సుదీర్ఘ పోరాటం తర్వాత మీకు విముక్తి, శాంతి లభించిందని భావిస్తున్నాను. నువ్వు ఈ లోకం నుంచి వెళ్లిపోయినందుకు బాధగా ఉంది. ఇప్పటికైనా నీకు ప్రశాంతత లభిస్తుందని ఆశిస్తున్నాను. ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండండి' అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది. ఈ పోస్ట్‌పై పలువురు సెలబ్రిటీలు స్పందిస్తూ ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు.

కాగా వనితా విజయ్‌ కుమార్‌ 2020 జూన్‌ 27న పీటర్‌ పాల్‌ను పెళ్లాడింది. ఇది వనితకు మూడో పెళ్లి ​కాగా పీటర్‌కు రెండో పెళ్లి. అయితే తనకు విడాకులు ఇవ్వకముందే పీటర్‌ మరొకరిని పెళ్లి చేసుకున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది అతడి మొదటి భార్య ఎలిజబెత్‌. అదంతా అబద్ధమని, ఎలిజబెత్‌కు విడాకులిచ్చిన తర్వాతే వనితను పెళ్లాడానని ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు పీటర్‌. కానీ వీరి బంధం కూడా ఎంతో కాలం నిలవలేదు. పెళ్లైన నాలుగు నెలలకే వనితా- పీటర్‌ విడిపోతున్నట్లు వెల్లడించారు. పీటర్‌ మద్యానికి బానిసై అసభ్యంగా ప్రవర్తించడం వల్లే వనిత అతనిని విడిచిపెట్టినట్లు ఆ మధ్య ప్రచారం జరిగింది. మద్యం తాగే అలవాటు వల్లే పీటర్‌ అనారోగ్యానికి గురై మరణించినట్లు తెలుస్తోంది.

చదవండి: తండ్రి కావాలనుకుంటున్న సల్మాన్‌.. పెళ్లి మాత్రం వద్దట

ఎవరూ ఇల్లు ఇవ్వడం లేదు.. చాలా కష్టంగా ఉంది: నటి

Videos

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

మా టైమ్ వచ్చాక కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే! మాస్ వార్నింగ్

సెక్యూరిటీ ఇస్తాం అని పిలిచి... లాఠీ ఛార్జ్ పై రాచమల్లు సంచలన కామెంట్స్

మంచు కొండల్లో మొదలైన విధ్వంసం.. రష్యాలో 7 తీవ్రతతో భూకంపం!

YS జగన్ విజువల్స్ @గన్నవరం ఎయిర్ పోర్ట్

తాడిపత్రిలో ఎన్నికల టెన్షన్.. YSRCP జాఫర్ ను కిడ్నాప్ చేసిన జేసీ వర్గీయులు

మైదుకూరు నామినేషన్ సెంటర్లో కి వెళ్ళి... దౌర్జన్యం చేసిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్

Photos

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)