Breaking News

ప్రేమించిన అమ్మాయికి వేరే వ్యక్తితో పెళ్లి.. హ్యాపీగా ఫీలయ్యా: శివ కార్తీకేయన్‌

Published on Thu, 02/13/2025 - 11:20

ప్రతి వ్యక్తికి ఓ లవ్‌ స్టోరీ ఉంటుంది. కొంతమంది ప్రేమలో సక్సెస్‌ అయితే..మరికొంతమందికి విఫలం అవుతారు. అయితే సక్సెస్‌ అయినా కాకపోయినా సరే ఫస్ట్‌లవ్‌ అనేది ఓ మధుర జ్ఞాపకం. మొదటగా ప్రేమించిన అమ్మాయి/ అబ్బాయిని మర్చిపోలేం. అందరిలాగే తాను కూడా తన ఫస్ట్‌లవ్‌ని మర్చిపోలేనని అంటున్నాడు తమిళ హీరో శివకార్తీకేయన్‌(Sivakarthikeyan ). ఎలాంటి బ్యాగ్రౌండ్‌ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి.. పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదిగాడు శివకార్తికేయ. రీసెంట్‌గా ‘అమరన్‌’తో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అందుకున్నాడు.

తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో తన లవ్‌స్టోరీని చెప్పుకున్నాడు. తన ఫస్ట్‌లవ్‌ విఫలమైందని చెప్పారు. ‘కాలేజీ డేస్‌లో ఒక అమ్మాయిని ప్రేమించాను. నాది వన్‌సైడ్‌ లవ్‌. ఆమెను కలిసి నా ప్రేమను వ్యక్తం చేయలేదు. కానీ దూరంగా చూస్తూనే ప్రేమించాడు. ఓ సారి ఆమె తన ప్రియుడితో కలిసి వెళ్లిపోవడం చూశాను. అప్పటి నుంచి ఆమెను చూడలేదు. నా ప్రేమ విషయం చెప్పకుండానే విఫలం అయింది. చాలా రోజుల తర్వాత ఓ షాపింగ్‌ మాల్‌లో ఆమెను మళ్లీ చూశాను. అప్పటికే ఆమెకు పెళ్లి అయింది. అయితే ఆమె పెళ్లి చేసుకున్నది ముందు ప్రేమించిన వ్యక్తి కాదు. వేరే అబ్బాయితో పెళ్లి జరిగిపోయింది. అది చూసి ‘మనకు దొరకని అమ్మాయి అతనికి కూడా దొరకలేదు(నవ్వుతూ..)’ అని సంతోషించాను’ అని శివకార్తీకేయ తన ఫెల్యూర్‌ లవ్‌స్టోరీని చెప్పుకొచ్చాడు.

కాగా శివ కార్తికేయన్ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టక ముందే వైవాహిక బంధంలోకి అడుగు పెట్టాడు. 2010లో ఆర్తిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఈ జంటకి 2013లో కూతురు ఆరాధన, 2021లో కుమారుడు గుగన్‌ దాస్‌ జన్మించారు.

సినిమాల విషయానికొస్తే.. శివ చేతిలో ప్రస్తుతం రెండు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. వాటిలో ఒక సినిమాకు ఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వం వహిస్తున్నాడు.ఈ సినిమా టైటిల్ ఫిబ్రవరి 17న నటుడు శివకార్తికేయన్ పుట్టినరోజున విడుదల కానుంది. ఈ సినిమాలో శివకార్తికేయన్ సరసన రుక్మిణి వసంత నటిస్తోంది. ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంతో పాటు సుధా కొంగర దర్శకత్వంలో ‘పరాశక్తి’ అనే సినిమా చేస్తున్నాడు.  ఈ సినిమాలో శివకార్తీకేయన్ తో పాటు శ్రీలీల, అథర్వ, రవి మోహన్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)