10 వేలతో 9 లక్షల లాభం.. HDFC Flexi Cap Fund రికార్డ్ రిటర్న్స్
Breaking News
చెప్పులతో పోస్టర్లపై కొట్టారు.. గలీజ్ మాటలు మాట్లాడారు
Published on Sun, 09/13/2026 - 10:59
షార్ట్ ఫిల్మ్ నటిగా మొదలై తెలుగు సినిమాల్లో హీరోయిన్ అయ్యేంతవరకు వచ్చిన వైష్ణవి చైతన్య.. రీసెంట్గా 'ఎపిక్' మూవీతో థియేటర్లలోకి వచ్చింది. దీని ప్రమోషన్లలో భాగంగా పలు ఇంటర్వ్యూల్లో పాల్గొన్న వైష్ణవికి 'బేబి' రిలీజ్ తర్వాత ఎదురైన నెగిటివిటీ గురించి ప్రశ్న ఎదురైంది. దీనికి బదులిస్తూ అప్పుడు తాను ఎలాంటి మానసిక వేదన అనుభవించానో బయటపెట్టింది.
(ఇదీ చదవండి: థియేటర్లలో ఉండగానే ఓటీటీకి 'ఇరుముడి'.. అధికారిక ప్రకటన)
''బేబి' నాకు ఓవర్నైట్ వచ్చిన సక్సెస్ కాదు. కవర్ సాంగ్స్, షార్ట్ ఫిల్మ్స్, క్యారెక్టర్ రోల్స్ ఇలా చాలా చేసుకుంటూ ఇక్కడివరకు వచ్చాను. అయితే ఈ సినిమా చూసిన తర్వాత చాలామంది నోటికి వచ్చినట్టు గలీజ్ మాటలు మాట్లాడారు. చెప్పులు తీసుకుని పోస్టర్లపై కొట్టారు. మంచిగా అనిపించలేదు. మస్తు బాధ అయింది. మూవీ ఇంత సక్సెస్ అయిందని ఎంజాయ్ చేయాలా? లేదా నేను చేసినదంతా దీని కోసమా అని బాధపడాలా అనే జోన్లోకి వెళ్లిపోయినా. కొన్నాళ్లకు దాని గురించి పట్టించుకోవడం మానేసి పాజిటివ్ అంశాలపై ఫోకస్ చేయడం మొదలుపెట్టా' అని వైష్ణవి చైతన్య బాధపడుతూ తన బాధని చెప్పుకొచ్చింది.
2023లో రిలీజైన 'బేబి' సినిమాతో వైష్ణవి చైతన్య పేరు మార్మోగిపోయింది. ఇందులో ఈమె యాక్టింగ్, కొన్ని సీన్స్ చూసి చాలామంది ఈమెని తిట్టుకున్నారు. విపరీతమైన ట్రోలింగ్ కూడా చేశారు. ఇప్పటికీ ఈమె పేరు చెబితే 'బేబి'నే చాలామందికి గుర్తొస్తుంది. అలాంటిది చిత్రం హిట్ అయినా సరే అంతలా బాధపడిందని లేటెస్ట్ ఇంటర్వ్యూ చూస్తే అర్థమైంది.
(ఇదీ చదవండి: పైలెట్ని పెళ్లి చేసుకున్న ప్రముఖ హీరోయిన్)
Actress #VaishnaviChaitanya about Negativity She Faced After Baby Release:
Baby చూసి నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారంట… చెప్పులు తీసుకుని పోస్టర్లపై కొడుతున్నారు… గలీజ్ మాటలు మాట్లాడుతున్నారు… మంచిగా అనిపించలేదు. మస్తు బాధ అయింది.
BABY ఇంత సక్సెస్ అయిందని ENJOY చేయాలా…… pic.twitter.com/NBft9OEhgv— cinee worldd (@Cinee_Worldd) September 12, 2026
Tags : 1