వాలా-2 కాదు.. కోట్లు కొల్లగొడుతున్న మరో చిన్న సినిమా

Published on Wed, 04/22/2026 - 14:52

టాలీవుడ్‌లో చిన్న సినిమాలను జనాలు అస్సలు పట్టించుకోరు. వారంలో రెండు, మూడు చిన్న సినిమాలు అలా వచ్చి ఇలా వెళ్తుంటాయి. అదీ మన టాలీవుడ్‌లో చిన్న చిత్రాల పరిస్థితి. కంటెంట్ ఉంటేనే అంతో ఇంతో జనాలు ఆదరిస్తున్నారు. మరి మలయాళ ఇండస్ట్రీలో మాత్రం పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. మలయాళంలో రిలీజైన చిన్న సినిమాలు సైతం బాక్సాఫీస్ వద్ద కోట్లు రాబడుతున్నాయి. ఇటీవలే వాలా-2 మూవీ ఏకంగా రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. మాలీవుడ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన ఐదో సినిమాగా ఘనత దక్కించుకుంది.

మలయాళ ఇండస్ట్రీలో వాలా-2 ప్రభంజనం కొనసాగుతుండగానే మరో సినిమా సైతం దూసుకెళ్తోంది. వారం రోజుల గ్యాప్‌లో రిలీజైన భరతనాట్యం- 2 మోహినియాట్టం అనే చిన్న మూవీ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ చిత్రం థియేటర్లలో విడుదలైన 10 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 21.50 కోట్లు వసూలు చేసింది. తక్కువ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం కలెక్షన్స్‌ పరంగా అదరగొడుతోంది. వాలా-2 నుంచి పోటీ ఉన్నప్పటికీ వసూళ్ల పరంగా ఏమాత్రం తగ్గడం లేదు. ఇలా చిన్న సినిమాలతో కోట్లు గడించడం కేవలం మలయాళ ఇండస్ట్రీకే సాధ్యమవుతోంది.

ఈ సినిమా కేవలం కేరళలో మాత్రమే కాదు.. కర్ణాటకలోనూ వసూళ్లు రాబడుతోంది. ఓవర్‌సీస్‌లో రిలీజైన ఈ మూలీ  యునైటెడ్ కింగ్‌డమ్, ఉత్తర అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ దేశాల్లోనూ కలెక్షన్స్ రాబడుతోంది. దీంతో ఈ డార్క్ కామెడీ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. కాగా.. ఈ సినిమాలో సూరజ్ వెంజరమూడు, సైజు కురుప్  కీలక పాత్రల్లో నటించారు.

 

Videos

తెలంగాణలో కొనసాగుతున్న బంద్.. అల్లాడుతున్న ప్రయాణికులు

ఈ సినిమాలో పెద్ద స్టార్ట్ నటీమణులు ఒకేసారి కనిపించనున్నారు

పెళ్లి అయిన 3 నెలల నుంచే గర్భిణీ అని కూడా చూడలేదు

పవన్ కళ్యాణ్.. మీ పార్టీలో ఏం జరుగుతుందో మీకు తెలుసా?

భరణం పేరుతో భర్తపై 'భారం' విడాకుల కేసుల్లో విడ్డూరాలు?

మాజీ సీఎం నాదెండ్ల మృతిపై YS జగన్ సంతాపం

చిట్టిబాబు మరణం సినీ పరిశ్రమకు తీరని లోటు

సీఎం రేవంత్ పాటలు పై సింగర్ మధుప్రియ కామెంట్స్

జగనన్న ఇళ్లు కాదు ఊర్లు ఊర్లే సృష్టించాడు, అది వైఎస్ జగన్ అంటే..

సందిట్లో సడేమియా RTC సమ్మెతో.. తెలంగాణలో కర్ణాటక స్పెషల్ బస్సులు

Photos

+5

ప్రకృతి ఒడిలో అనసూయ సమ్మర్ చిల్ (ఫొటోలు)

+5

తస్సాదియ్యా.. సమంత ఇంత సింపుల్‌గా ఉందేంటి! (ఫొటోలు)

+5

కాబోయే భార్యతో కలిసి కాశీకి రింకూ సింగ్‌ (ఫొటోలు)

+5

నేటి నుండి కేదార్‌నాథ్‌ దర్శనం.. భారీగా భక్తులు (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో ఉన్న ఈ అద్భుతమైన శివాలయం గురించి తెలుసా మీకు? (ఫోటోలు)

+5

'వాలా 2' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తేజా సజ్జా సందడి (ఫొటోలు)

+5

వైఎస్‌ జగన్‌ పులివెందుల పర్యటన (ఫోటోలు)

+5

SRH vs DC : ఉప్పల్‌ స్టేడియంలో ఆరెంజ్‌ ఆర్మీ, సెలబ్రిటీల సందడి (ఫొటోలు)

+5

కూతురు, కుమారుడితో తారకరత్న భార్య ‍అలేఖ్య రెడ్డి (ఫొటోలు)

+5

మృణాల్ ఠాకుర్ 'ఫ్లవర్' లవ్.. ఎన్నో వెరైటీస్ (ఫొటోలు)