Breaking News

అప్పుడు భాషాలా.. ఇప్పుడు దావూద్ ఇబ్ర‌హీంలా..

Published on Mon, 05/06/2024 - 11:08

దర్శకుడు అమీర్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ఉయిర్‌ తమిళుక్కు. చాందిని శ్రీధర్ హీరోయిన్‌గా నటించారు. అనంద్‌రాజ్‌, ఇమాన్‌ అన్నాచ్చి, రాజ్‌కపూర్‌, మారిముత్తు, సుబ్రమణిశివ, మహానది శంకర్‌, గంజాకరుప్పు, రాజసిమ్మన్‌, శరవణ శక్తి తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. విద్యాసాగర్‌ సంగీతం అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈ నెల 10వ తేదీన విడుదలకు సిద్ధం అవుతోంది.

ఎవ‌రూ ముందుకు రావ‌ట్లే
ఈ మూవీ విడుదల హక్కులను పీవీఆర్‌ ఐనాక్స్‌ పిక్చర్స్‌ సంస్థ సొంతం చేసుకుంది. శనివారం సాయంత్రం చైన్నెలో జ‌రిగిన మీడియా స‌మావేశంలో చిత్ర దర్శక నిర్మాత ఆదంబావ మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన కొన్ని సంఘటనల కారణంగా దర్శకుడు అమీర్‌ హీరోగా నటించడంతో ఈ చిత్రాన్ని కొనుగోలు చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదన్నారు.

ఆయ‌న అలా.. ఈయ‌న ఇలా
తనను దర్శకుడిగా పరిచయం చేసింది ఆయనేనన్నారు. అమీర్‌ తనకు 40 ఏళ్ల మిత్రుడని చెప్పారు. తామిద్దం మదురైకు చెందిన వారిమేనని చెప్పారు. అమీర్‌ మదురైలో భాషాలా ఉండేవారని, సినిమా రంగంలోకి వచ్చిన తరువాత మాణిక్యంగా మారారని, ఇప్పుడు దావూద్‌ ఇబ్రహీంగా మార్చుతున్నారన్నారు. అమీర్‌ తమిళంపై ప్రేమతో చాలా కోల్పోయారని, ఆయన సమకాలీకుడు సీమాన్‌ ఇప్పుడు ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా రాణిస్తున్నారన్నారు.

ఆ అవ‌స‌రం నాకు లేదు
దర్శకుడు, ఈ చిత్ర కథానాయకుడు అమీర్‌ మాట్లాడుతూ.. తాను దర్శకత్వం వహించిన ఇరైవన్‌ మిగ పెరియవన్‌ చిత్ర నిర్మాత నిందితుడిగా ఆరోపణలను ఎదుర్కొంటుంటే తనను అందుకు బాధ్యుడిని చేయడం ఏమిటని ప్రశ్నించారు. నిందితుడి డబ్బుపై ఆధారపడాల్సిన అవసరం నాకు లేదన్నారు. అయినా ఈ కేసు విచారణలో ఉందని, తాను ఈడీ వంటి దర్యాప్తు సంస్థలకు పూర్తిగా సహకరిస్తున్నట్లు చెప్పారు.

Videos

సచివాలయ ఉద్యోగులంటే చంద్రబాబుకు ఎందుకింత కక్ష..?

పెళ్లి చూసుకున్నవాళ్లకే దిక్కులేదు... 15 ఏళ్ళు కలిసుంటారట..!

KAAKA నుంచి క్రేజీ అప్డేట్

ఓ బ్రాహ్మణ్ పై కక్ష్య సాధిస్తే... వేమిరెడ్డి దంపతులు ఇది నా ఆక్రందన! శ్రావణ్ శర్మ సతీమణి

సచివాలయం ఉద్యోగులను ఎలా ఈడ్చుకెళ్తున్నారో చూడండి

ఈసీ నియామక విధానంపై జగన్ ప్రశ్నలు.. అసలు వివాదం ఏంటి?

పాత అంబులెన్సుకు కొత్త రంగులు వేసిన ఏపీ సర్కారు

సిగ్గుందా చంద్రబాబు..! ఉద్యోగులంటే బానిసలనుకున్నారా..?

పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. నెలకు అకౌంట్లోకి 20,000

హిమాలయాల్లో పెను సునామీ! 200 కోట్ల మందికి డేంజర్ బెల్స్!

Photos

+5

ఎర్రచీరలో అందంగా శోభిత చెల్లి సమంత (ఫొటోలు)

+5

'ఆదర్శ కుటుంబం'లోని నారాయణమ్మ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

భర్తతో కలిసి మలేసియా ట్రిప్‌లో హీరోయిన్ అపర్ణ(ఫొటోలు)

+5

'ప్యారడైజ్'లో కేసీఆర్‌ని పోలిన పాత్ర.. షూటింగ్‌లో ఇలా(ఫొటోలు)

+5

బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ వైబ్‌లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి (ఫోటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’లో సంపూర్ణేష్‌ బాబు భార్యగా విషిక.. గ్లామర్‌ ఫొటోలు వైరల్‌

+5

మిజ్వాన్‌ ఫ్యాషన్‌ షోలో అలియా, విక్కీ సందడి(ఫోటోలు)

+5

నాలుగు పదులు దాటినా మరింత గ్లామరస్‌గా శ్రియా శరణ్..(ఫోటోలు)

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’ సక్సెస్‌ మీట్‌ (ఫొటోలు)