Breaking News

అమెరికాలో ఉస్తాద్‌ కలెక్షన్స్‌.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు

Published on Sat, 03/28/2026 - 11:05

పవన్ కళ్యాణ్ - హరీష్ శంకర్ కాంబినేషన్‌లో విడుదలైన కొత్త మూవీ ‘ఉస్తాద్ భగత్‌సింగ్’. మార్చి 19న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఉగాది, రంజాన్ సెలవులు ఉన్నప్పటికీ కలెక్షన్స్‌ పరంగా నిరాశపరిచింది. తొమ్మిదిరోజుల్లో ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ. 68.06 కోట్ల నెట్‌ రాబట్టినట్లు సాక్నిల్క్‌ ట్రేడ్‌ సంస్థ ప్రకటించింది. అయితే, ఓవర్సీస్‌లో ఉస్తాద్‌ కనీసం 1మిలియన్‌ మార్క్‌ కూడా దాటలేదు. ఆపై శుక్రవారం నాడు నార్త్ అమెరికాలో ఈ మూవీకి వచ్చిన కలెక్షన్స్‌ చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

నార్త్ అమెరికాలో ఉస్తాద్‌ భగత్‌సింగ్‌ ఇప్పటి వరకు రూ. 6 కోట్లు మాత్రమే రాబట్టింది. అక్కడ లాభాల్లోకి ఈ చిత్రం రావాలంటే కనీసం మరో రూ. 7 కోట్లు రాబట్టాలి. లేదంటే భారీ నష్టాలు తప్పవు. ఇప్పటి వరకు ఈ సినిమా కనీసం 1 మిలియన్ డాలర్ల మార్కును కూడా అక్కడ అందుకోకపోవడంతో ట్రేడ్ నిపుణులు నివ్వెరపోయారు. 

శుక్రవారం నాడు అయితే అమెరికాలో కేవలం 4వేల డాలర్లు రూ. 3.79 లక్షలు మాత్రమే రాబట్టింది. సినిమా డిజాస్టర్‌ కావడంతో చాలాచోట్ల ఉస్తాద్‌ను తొలగించేశరాఉ. ఇది డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలను మిగిల్చే అవకాశం ఉందని అంటున్నారు. బాక్సాఫీస్ వద్ద తమ అంచనాలను నిరాశపరిచినందుకు దర్శకుడు హరీష్ శంకర్‌ను చాలామంది ఫ్యాన్స్‌ నిందిస్తున్నారు. దీంతో  ఆయన సోషల్ మీడియాలో తీవ్రమైన ట్రోలింగ్‌ను ఎదుర్కొంటున్నారు. అయితే, అమెరికాలో ధురంధర్‌-2 దుమ్మురేపుతుంది. ప్రస్తుతం రూ. 275 కోట్లు సాధించి రికార్డ్‌ నెలకొల్పింది. 

Videos

అమరావతి పేరుతో అడ్డగోలుగా దోచుకుంటున్నావ్ .. KK రాజు సంచలన రియాక్షన్

మ్యాచ్ మధ్యలో కుక్క ఎంట్రీ.. ఢిల్లీ ప్లేయర్ ఏం చేశాడో తెలిస్తే షాక్ అవుతారు

రాజమండ్రి పోలీస్ స్టేషన్ లో రగడ..CI బాజీలాల్ పై మార్గాని భరత్ ఫైర్

గ్యాస్ కోసం ఆటోవాలాల కష్టాలు కిలోమీటర్ల మేర వాహనాలు

2029లో జగన్ వస్తాడనే భయంతోనే అమరావతిపై చట్టబద్ధత బిల్లు..

తెలంగాణలో రానున్న 5 రోజులు భారీ వర్షాలు

తృణమూల్ కాంగ్రెస్ పాలనపై పుస్తకాన్ని విడుదల చేసిన అమిత్ షా

రూపం మార్చుకొని మళ్లీ విజృంభిస్తున్న కరోనా వైరస్..

అమెరికా సంచలన ప్రకటన ఇరాన్ పని ఖతం!

అమెరికా స్థావరాలపై ఇరాన్ డ్రోన్ దాడులు

Photos

+5

'కొన్ని క్షణాలు హృదయానికి హత్తుకుంటాయి'.. కూతురితో మంచు లక్ష్మీ (ఫోటోలు)

+5

90ల నాటి కలల రాణి.. మేకప్‌ లేకుండా నెరిసిన జుట్టుతో (ఫొటోలు)

+5

వేములవాడ : రాజన్నతో హిజ్రాల పెళ్లిమహోత్సవం...ఏళ్లుగా కొనసాగుతున్న ఆచారం (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : ‘టీచ్‌ ఫర్‌ చేంజ్‌’...అలరించిన సినీ ప్రముఖుల ర్యాంప్‌ వాక్‌ (ఫొటోలు)

+5

వారణాసిలో యాంకర్ రష్మీ గౌతమ్ పూజలు (ఫొటోలు)

+5

శ్రీరామనవమి వేడుకల్లో మంచు మనోజ్ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

చిరంజీవి ఆధ్వర్యంలో రామ్ చరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రామ్ చరణ్ బర్త్‌డే స్పెషల్‌ (ఫొటోలు)

+5

మార్కాపురం బస్సు ప్రమాదం.. హృదయ విదారక దృశ్యాలు

+5

అనంతపురంలో దేవరకొండ, రష్మిక సందడి (ఫొటోలు)