Breaking News

'ఉస్తాద్ భగత్ సింగ్' సెన్సార్ పూర్తి.. రన్‌టైమ్ ఎంతంటే?

Published on Tue, 03/10/2026 - 20:03

పవన్ కల్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్'. తొలుత ఈ నెల 26న థియేటర్లలోకి తీసుకురావాలని అనుకున్నారు. కానీ అనుకోని విధంగా ఓ వారం ముందే వచ్చేస్తున్నట్లు కొన్నిరోజుల క్రితం ప్రకటించారు. ఉగాది సందర్భంగా 19వ తేదీన మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పుడు సెన్సార్ కార్యక్రమాల పూర్తయ్యాయి.ఈ క్రమంలోనే రన్ టైమ్ ఎంతనేది కూడా బయటకొచ్చింది.

(ఇదీ చదవండి: ఊహించని దర్శకుడితో ప్రభాస్.. రొయ్యల బిర్యానీతో డిన్నర్)

'ఉస్తాద్..' చిత్రానికి విడుదలకు 9 రోజుల ముందే సెన్సార్ చేసేశారు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేశారు. ఈమేరకు ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. సెన్సార్ సభ్యులు.. ఎలాంటి కట్స్ చెప్పలేదట. అలానే 2 గంటల 34 నిమిషాల నిడివితో మూవీ రిలీజ్ కానుందని తెలుస్తోంది.

హరీశ్ శంకర్ ఈ చిత్రానికి దర్శకుడు కాగా మైత్రీ మూవీస్ నిర్మించింది. దేవిశ్రీప్రసాద్ సంగీతమందించాడు. కానీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కోసం తమన్ పనిచేస్తున్నాడు. శ్రీలీల, రాశీఖన్నా హీరోయిన్లు. అయితే ఇది తమిళ సినిమా 'తెరి'కి రీమేక్ అని చాలారోజులుగా ప్రచారం నడిచింది. మూవీ టీమ్ మాత్రం పదే పదే వీటిని ఖండించింది. సెన్సార్ ముగించారు. ట్రైలర్ కూడా వదిలితే సినిమా కంటెంట్ ఏంటనేది ఓ క్లారిటీ వస్తుంది.

(ఇదీ చదవండి: డైరెక్ట్ ఓటీటీలో రిలీజైన తెలుగు హారర్ థ్రిల్లర్ సినిమా)

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)