ఊర్వశీ రౌతేలా, అర్చకులు మధ్య వివాదం.. క్లారిటీ ఇచ్చిన టీమ్‌

Published on Sat, 04/19/2025 - 13:07

బాలీవుడ్‌ నటి ఊర్వశీ రౌతేలా (Urvashi Rautela) తనకు దక్షిణాదిన గుడి కట్టి తీరాల్సిందేనని చేసిన  వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారితీసింది. ఉత్తరాఖండ్‌లో తనకు ఓ గుడి కట్టారని. ఆపై బద్రీనాథ్‌కు దగ్గర్లోనే ఊర్వశి దేవాలయం ఉందని ఒక ఇంటర్వ్యూలో ఆమె కామెంట్‌ చేశారు. ఎప్పుడూ ఎదో వివాదంలో చిక్కుకునే ఈ బ్యూటీ మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది. ఆమె చేసిన వ్యాఖ్యలపై తాజాగా తన టీమ్‌ క్లారిటీ ఇచ్చింది. ఆమె చేసిన కామెంట్స్‌ను ప్రజలు తప్పుగా అర్థం చేసుకున్నారని ఊర్వశీ టీమ్‌ పేర్కొంది.

'ఊర్వశీ తన పేరు మీద ఆలయం ఉందని మాత్రమే చెప్పారు. కానీ, అది తన ఆలయమని ఆమె ఎక్కడా చెప్పలేదు. అయితే, కొందరు  ఆమె వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకుని విమర్శలు చేస్తున్నారు. మీరందరు కూడా మరోసారి ఊర్వశీ మాట్లాడిన వీడియోను చూడండి. అప్పుడు ఆమె మాటలను అర్థం చేసుకుంటారని అందరినీ కోరుతున్నాం. ఢిల్లీ యూనివర్సిటీలో ఊర్వశీ ఫోటోకు దండలు వేసి పూజలు చేస్తారని చెప్పడం నిజమే.. కావాలంటే ఎవరైనా విచారించుకోవచ్చు. ఇప్పటికే పలు ఫోటోలు, వీడియోలు కూడా వైరల్‌ అయ్యాయి. ప్రస్తుతం కూడా అందుబాటులో ఉన్నాయి. ఆమె వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకుని అవమానకరమైన కామెంట్లు చేయడం చాలా దారుణం. అందరినీ గౌరవించండి.' అంటూ ఊర్శశీ టీమ్‌ ఒక పోస్ట్‌ చేసింది.

బద్రీనాథ్‌కు ఎవరైనా వెళితే పక్కనే ఉన్న తన ఆలయాన్ని  సందర్శించాలని ఊర్వశీ కోరడంతో  బద్రీనాథ్‌ సమీపంలోని ఆలయాల అర్చకులు భగ్గుమన్నారు. ఊర్వశీ తన వ్యాఖ్యలతో భక్తులను  తప్పుదోవ పట్టిస్తున్నారని వారు తెలిపారు. ఇలాంటి పద్ధతి ఎంతమాత్రం మంచిది కాదని వార్నింగ్‌ ఇచ్చారు. బద్రీనాథ్ సమీపంలో ఉన్న బామ్నిలో ఊర్వశీ పేరుతో ఒక ఆలయం ఉన్నమాట వాస్తవమేనని అర్చకులు క్లారిటీ ఇచ్చారు. కానీ, ఆ ఆలయానికీ, ఊర్వశీకి ఎలాంటి సంబంధం లేదని వారు తెలిపారు.

Videos

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)