Breaking News

అందుకే రిషబ్‌ భయ్యా పెళ్లి చేసుకోవడం లేదు.. ఊర్వశిపై దారుణ ట్రోల్స్!

Published on Thu, 08/22/2024 - 15:34

బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా గురించి పరిచయం ‍అక్కర్లేదు. వాల్తేరు వీరయ్య, ఏజెంట్ లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఊర్వశి చివరిసారిగా బాలీవుడ్‌లో గుస్పైతియా చిత్రంలో కనిపించింది. ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ చిత్రంలో కనిపించనుంది ముద్దుగుమ్మ. ఇదిలా ఉండగా.. తాను ఆస్పత్రిలో ఉన్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. తన చేతికి అయిన గాయాన్ని చూపిస్తూ తన కోసం ప్రార్థించండి అంటూ పోస్ట్ చేసింది.

అయితే ఊర్వశి రౌతేలా పోస్ట్‌పై నెటిజన్స్ మండిపడుతున్నారు. అంత చిన్న మైనర్‌ గాయానికి ఆస్పత్రిలో ఎందుకు అడ్మిట్ అయ్యారని నెటిజన్స్ ప్రశ్నించారు. ఈ వీడియోపై ఒకరు స్పందిస్తూ.. వేలికి చిన్న గాయంతో ఆసుపత్రిలో చేరిన మొదటి భారతీయ మహిళ అని ఫన్నీగా కామెంట్స్ చేశాడు. మరొకరు అంతర్జాతీయ స్థాయిలో గాయపడిన మొదటి భారతీయ మహిళ ఊర్వశి అని రాసుకొచ్చాడు. ఇంత చిన్న గాయానికి ఏకంగా ఆక్సిజన్‌ తీసుకుంటున్నారా? అసలేంటి నాన్‌సెన్స్‌ అంటూ కామెంట్ చేశాడు. ఇలాంటి ప్రవర్తన కారణంగానే రిషబ్ భాయ్ మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం లేదంటూ ఓ నెటిజన్‌ రాశారు. అయితే నెటిజన్ల నుంచి పూర్తి వ్యతిరేకత రావడంతో బాలీవుడ్ భామ ఆశ్చర్యపోయింది.

అంతేకాకుండా తనపట్ల మీడియాలో వస్తున్న వార్తలపై ఊర్వశి రౌతేలా మండిపడింది. త్వరగా కోలుకోవాలని శుభాకాంక్షలు చెప్పే బదులు.. తనపై అన్ని హద్దులు దాటి ప్రవర్తించడంతో నిరాశకు గురయ్యానని తెలిపింది. ఇటువంటి విపరీతమైన, అగౌరవపరిచే సంస్కృతి సమాజంలో అత్యాచారం లాంటి దారుణమైన చర్యలకు పునాదిగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేసింది. అంతేకాకుండా ఆ వార్త ప్రచురించిన క్లిప్‌ను కూడా షేర్ చేసింది ముద్దుగుమ్మ. 
 

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)