Breaking News

భలే చాన్స్‌?

Published on Tue, 02/25/2025 - 02:12

‘వేర్‌ ఈజ్‌ ద పార్టీ.. బాసూ వేర్‌ ఈజ్‌ ద పార్టీ..’ అంటూ తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు ఊర్వశీ రౌతేలా(Urvashi Rautela). చిరంజీవి హీరోగా నటించిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రంలోని ‘వేర్‌ ఈజ్‌ ద పార్టీ..’ అంటూ సాగే ప్రత్యేక పాటలో ఆడిపాడారామె. ఆ తర్వాత ‘ఏజెంట్, బ్రో, స్కంద’ వంటి సినిమాల్లో స్పెషల్‌ సాంగ్స్‌తో అలరించారు.

ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన బాలకృష్ణ ‘డాకు మహారాజ్‌’ చిత్రంలో ఊర్వశి ఓ కీలక పాత్ర చేయడంతో పాటు ‘దిబిడి దిబిడి’ పాటలో తనదైన డ్యాన్సులతో ఆకట్టుకున్నారు. ఇదిలా ఉంటే.. ఎన్టీఆర్‌ హీరోగా నటిస్తున్న ‘ఎన్టీఆర్‌ నీల్‌’(వర్కింగ్‌ టైటిల్‌) చిత్రంలో నటించే భలే చాన్స్‌ని ఊర్వశీ రౌతేలా అందుకున్నారనే వార్తలు నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి.

ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కల్యాణ్‌ రామ్‌ నందమూరి, నవీన్‌ ఎర్నేని, రవిశంకర్‌ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఊర్వశీ రౌతేలా ఓ కీలక పాత్ర పోషించనున్నారట. ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుపుకుంటోంది. తర్వాతి షెడ్యూల్‌లో ఆమె పాల్గొంటారని టాక్‌.

Videos

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)