'నేను మరొకరిలా ఉండేందుకు రాలేదు'.. ఐశ్వర్యతో పోలికపై మండిపడ్డ ఊర్వశి భామ!

Published on Tue, 05/27/2025 - 17:14

బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా ఇటీవల కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో సందడి చేసింది. విభిన్నమైన డ్రెస్సులతో స్పెషల్ ‍అట్రాక్షన్‌గా నిలిచింది. ఫోటోలకు పోజులిస్తూ అందరి దృష్టిని ఆకర్షించింది ముద్దుగుమ్మ. అయితే ఈ ఫెస్టివల్‌లో ఊర్వశి తీరుపై విమర్శలొచ్చాయి.  తన ఫోటో షూట్‌ కోసం మెట్లను బ్లాక్ ‍చేశారంటూ సోషల్ మీడియాలో కొందరు ఆరోపించారు. కానీ అలాంటిదేం జరగలేదని.. తాను ముందే అనుమతి తీసుకున్నానని తెలిపింది ఊర్వశి రౌతేలా.

అంతేకాకుండా ఈ కాన్స్‌ ఫెస్టివల్‌కు హాజరైన ఐశ్వర్య రాయ్‌తో కొందరు పోల్చడంతో ఊర్వశి మరింత క్రేజ్ సంపాదించుకుంది. కానీ ఐశ్వర్య ఫిల్మ్ ఫెస్టివల్ చివర్లో మాత్రమే కనిపించింది. కాన్స్‌లో గుర్తింపు పొందిన ఐశ్వర్యతో పోల్చడం ఎవరికైనా గౌరవప్రదమైన విషయం అయినప్పటికీ.. నెటిజన్స్ కామెంట్‌ చేయడంపై ఊర్వశి స్పందించింది. ఈ మేరకు ఇన్‌స్టా స్టోరీస్‌లో క్లారిటీగా రాసుకొచ్చింది.

ఊర్వశి తన ఇన్‌స్టాలో రాస్తూ.. "నేను నా సొంత చరిష్మాతో ఐశ్వర్య రాయ్‌గా ఉండటానికి ప్రయత్నిస్తున్నా. ఎందుకంటే డార్లింగ్ ఐశ్వర్య ఓ ఐకానిక్. కానీ నేను మరొకరిలా నకిలీగా ఉండటానికి ఇక్కడికి రాలేదు. ఎందుకంటే నేను ఒక బ్లూ ప్రింట్. కాన్స్‌ ఫెస్టివల్‌లో  ప్రత్యేకంగా నిలబడటానికే వచ్చా. నా లుక్, నా స్టైల్, నా విశ్వాసం మీకు అసౌకర్యంగా అనిపిస్తే గట్టిగా ఓ శ్వాస తీసుకోండి. నేను అందరికీ నచ్చే వ్యక్తిని కాదు. నేను ఎల్లప్పుడు బాణసంచా, షాంపైన్ లాగా ఉంటా. నాపై ఎన్ని విమర్శలొచ్చినా ఎప్పటికీ ప్రకాశిస్తూనే ఉంటా. ఎందుకంటే ఎవరూ మీలాగా చేయరు.' అని రాసుకొచ్చింది. 

c

Videos

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

Photos

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)