చాలా సిగ్గుపడుతున్నా.. సైఫ్‌కు క్షమాపణలు చెప్పిన ఊర్వశి రౌతేలా

Published on Sat, 01/18/2025 - 10:32

బాలీవుడ్‌ నటుడు సైఫ్ అలీ ఖాన్‌కు నటి ఊర్వశి రౌతేలా (Urvashi Rautela) క్షమాపణలు చెప్పారు. సైఫ్‌పై జరిగిన దాడిని చాలామంది సినీ ప్రముఖులు తవ్రంగా ఖండించారు. కానీ,  డాకు మహారాజ్ (Daaku Maharaaj) సక్సెస్‌లో ఉన్న ఊర్వశి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సైఫ్‌పై జరిగిన దాడి గురించి కామెంట్‌ చేశారు. ఆయన త్వరగా కోలుకోవాలని అంటూనే తన చేతికి ఉన్న వ్రజపు ఉంగరాన్ని చూపుతూ మాట్లాడటం విమర్శలకు దారి తీసింది. దీంతో ఆమె క్షమాపణలు చెబుతూ సోషల్‌మీడియాలో ఒక నోట్‌ విడుదల చేశారు.

(ఇదీ చదవండి: ఓటీటీలో 'సింగం అగైన్‌' తెలుగు వర్షన్‌ స్ట్రీమింగ్‌)

'డియర్ సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) సర్.. మీకు క్షమాపణలు చెబుతూ పంచుకుంటున్న ఈ పోస్ట్ చేరుతుందని ఆశిస్తున్నాను. ఒక ఇంటర్వ్యూలో మీ గురించి మాట్లాడుతున్న సమయంలో నేను వ్యవహరించిన తీరుకు మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నాను. ఆ ఇంటర్వ్యూలో నేను మాట్లాడుతున్న సమయంలో మీరు ఎదుర్కొంటున్న సమస్య తీవ్రత గురించి నాకు తెలియదు. డాకు మహారాజ్‌ విజయం వల్ల వచ్చిన సంతోషంలో నేను ఉన్నాను. ఆ సక్సెస్‌ వల్ల నాకు వచ్చిన బహుమతుల గురించి మాట్లాడాను. మీపై జరిగిన దాడి తీవ్రత గురించి తెలుసుకున్న తర్వాత సిగ్గు పడుతున్నాను. నన్ను క్షమిస్తారని ఆశిస్తున్నాను. కష్ట సమయంలో మీరు చూపిన తెగువ, ధైర్యం చాలా గొప్పది' అని పేర్కొన్నారు.

సైఫ్‌పై ఊర్వశి చేసిన కామెంట్లు
'డాకు మహారాజ్' విజయం వల్ల తనకు చాలామంది బహుమతులు పంపించారని ఊర్వశి ఆ ఇంటర్వ్యూలో తెలిపారు. అదే సమయంలో తనకు వచ్చిన బహుమతులను సైఫ్‌ దాడికి ముడిపెట్టి మాట్లాడడటం వల్ల ఆమె విమర్శలు ఎదుర్కొన్నారు. 'సైఫ్‌పై దాడి దురదృష్టకరం. నేను నటించిన డాకు మహారాజ్  రూ.105కోట్లు వసూళ్లతో మంచి విజయం సాధించింది. నాకు మా అమ్మ డైమండ్‌ ఉంగరం కానుకగా ఇచ్చింది. 

మా నాన్న ఖరీదైన రోలెక్స్‌ వాచ్‌ ఇచ్చారు. అయితే, వాటిని ధరించి  బయటకు వెళ్లే పరిస్థితి లేదు. ఎందుకుంటే ఎవరైనా మనపై అలా దాడి (సైఫ్‌) చేస్తారనే భయం ఉంటుంది' అని అన్నారు. ఈ వ్యాఖ్యలపై ట్రోల్స్‌ రావడంతో ఊర్వశీ తాజాగా క్షమాపణలు చెప్పారు. సైఫ్ అలీ ఖాన్ దాడి జరిగింది దొంగతనం కోసమే కావడంతో ఆమె వ్యాఖ్యలు కూడా ఆ సంఘటనను గుర్తు చేస్తూ మాట్లాడటం వల్ల విమర్శలు వచ్చాయి.

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)