Breaking News

25 ఏళ్ల నుంచి అవకాశాలే రాలే, అందుకే ఇలా తయారైంది: ఉర్ఫీ

Published on Sun, 07/09/2023 - 15:26

ఓటీటీలో ఏముందని? అంతా గే, స్వలింగ సంపర్కానికి సంబంధించిన కంటెంట్‌తోనే నిండిపోయింది. అంతకుమించి అక్కడేం లేదు అని నటి అమీషా పటేల్‌ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తాజాగా నటి వ్యాఖ్యలపై సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌ ఉర్ఫీ జావెద్‌ ఫైర్‌ అయింది. 'అసలు గేయిజం, లెస్బియినిజం అంటే అర్థం తెలుసా? మీ పిల్లలను వాటికి దూరంగా ఉంచాలనుకుంటున్నారా?

ఇలాంటి తారలు ఇటువంటి సున్నితమైన అంశాల గురించి ముందుగా కొంత చదువుకుని వచ్చి మాట్లాడితే బాగుంటుంది. అలా కాకుండా ఏదీ తెలియకపోయినా ఏదో ఒకటి వాగితే నాకు చెడ్డ చిరాకు పుడుతుంది. బహుశా 25 ఏళ్లుగా ఏ పనీ దొరక్కపోవడం వల్ల ఆమె ఇలా తయారైనట్లుంది' అని వ్యంగ్యాస్త్రాలు సంధించింది. కాగా అమీషా పటేల్‌ త్వరలో గదర్‌ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ఈ మధ్య కాలంలో వస్తున్న సినిమాలు, సిరీస్‌లు కుటుంబమంతా కలిసి చూసేలా ఉండట్లేదు.

కానీ మా సినిమా మాత్రం అమ్మమ్మ-తాతయ్యలతోనూ కలిసి చూడవచ్చు. జనాలు ఒక మంచి సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలతో కలిసి సినిమా చూసే రోజులు పోయాయి. ఓటీటీలో అయితే అసలే చూడలేం. ఓటీటీలో స్వలింగ సంపర్కం, గేకు సంబంధించిన సన్నివేశాలే ఉంటున్నాయి. పిల్లలతో కలిసి చూడలేని అభ్యంతరకర రీతిలో కంటెంట్‌ ఉంటోంది. ఒక మంచి సినిమా కావాలని కోరుకుంటున్న ప్రేక్షకులకు గదర్‌ 2 తప్పకుండా ఒక మంచి సమాధానం అవుతుంది అని చెప్పుకొచ్చింది ఉర్ఫీ జావెద్‌. కాగా 2001లో వచ్చి గదర్‌: ఏక్‌ ప్రేమ్‌ కథ సినిమాకు ఈ చిత్రం సీక్వెల్‌గా తెరకెక్కింది. ఈ మూవీ ఆగస్టు 11న విడుదల కానుంది.

చదవండి: నైట్‌ క్లబ్‌లో హీరోయిన్‌తో ముద్దులాట.. హీరో ప్రైవేట్‌ వీడియో లీక్‌

Videos

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)