Breaking News

సినిమాలో 14 మంది హీరోలు.. 19 ఏళ్ల తర్వాత ఇప్పుడు థియేటర్లలో రిలీజ్

Published on Fri, 01/30/2026 - 13:37

ఎంత పెద్ద స్టార్ హీరో సినిమాకు అయినా కష్టాలు తప్పవు. కొన్నిసార్లు అలా జరిగిపోతుంటాయంతే. రీసెంట్‌గా ఓ వార్త చదివే ఉంటారు. రజనీకాంత్ హీరోగా చేసిన ఓ హిందీ మూవీ దాదాపు 40 ఏళ్ల తర్వాత రిలీజ్ కానుంది. ఇందులో అప్పటి హిందీ స్టార్ యాక్టర్స్ నటించారు. అయినా సరే పలు కారణాల వల్ల ఇన్నాళ్లకు బిగ్ స్క్రీన్‌పై విడుదలకు సిద్ధమైంది. ఇప్పుడు ఇలానే దాదాపు 19 ఏళ్ల తర్వాత ఓ కన్నడ చిత్రానికి మోక్షం లభించింది.

(ఇదీ చదవండి: మలయాళ హారర్ కామెడీ సినిమా.. 'సర్వం మాయ' రివ్యూ (ఓటీటీ))

కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. అప్పట్లో హీరోగా అలరించాడు. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా అడపాదడపా పలకరిస్తునే ఉన్నాడు. ఇతడు హీరోగా 2007లో మొదలైన కన్నడ చిత్రం 'రక్త కాశ్మీర'. రమ్య హీరోయిన్. కమర్షియల్ కథతోనే దీన్ని తెరకెక్కించారు. దీని విషయంలో మూవీని మించిన డ్రామా అయితే ఉంది. ఎన్నో ప్రత్యేకతలు కూడా ఉన్నాయనే చెప్పొచ్చు.

ఈ సినిమాలోని ఓ పాటలో ఏకంగా 14 మంది హీరోలు కనిపించారు. ఇప్పుడు సినిమా రిలీజయ్యే సమయానికి అందులో ముగ్గురు హీరోలు (పునీత్ రాజ్ కుమార్, విష్ణువర్ధన్, అంబరీష్) మరణించారు. మరో హీరో దర్శన్ జైలులో ఉన్నాడు. హీరోయిన్ రమ్య అయితే ఇండస్ట్రీకే దూరమైపోయారు. విచిత్రం ఏంటంటే కన్నడలో ఈ సినిమా ఈ రోజు (జనవరి 30) థియేటర్లలో రిలీజైంది. కానీ ఇదొచ్చిన సంగతి హీరో ఉపేంద్ర కూడా తెలియదని టాక్ అయితే వినిపిస్తుంది. మరి అలాంటప్పుడు ఎందుకు రిలీజ్ చేశారో? ఏంటో?

(ఇదీ చదవండి: ఓటీటీలోకి ప్రభాస్ 'రాజాసాబ్'.. అధికారిక ప్రకటన)

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)