Breaking News

పునీత్‌ జయంతి రోజునే ఉపేంద్ర సుదీప్‌ల కబ్జా రిలీజ్‌

Published on Wed, 01/25/2023 - 10:09

తమిళసినిమా: కేజీఎఫ్‌ పార్టు–1, పార్టు–2, కాంతార, 777 చార్లీ, విక్రాంత్‌ రోమా వంటి కన్నడ చిత్రాలు పాన్‌ ఇండియా స్థాయిలో విజయం సాధించి భారతీయ సినిమానే తమ వైపు తిప్పుకున్నాయి. తాజాగా అదే బాణీలో రూపొందిన కన్నడ చిత్రం కబ్జా. బహు భాషా నటులు ఉపేంద్ర, కిచ్చా సుదీప్‌ కథానాయకులుగా నటించిన ఇందులో నటి శ్రియ కథానాయకిగా నటించారు. మురళి శర్మ, సుధ ముఖ్యపాత్రలు పోషించారు. శిద్దేశ్వరా ఎంటర్‌ ప్రైజెస్‌ పతాకంపై ఆర్‌.చంద్రశేఖర్‌ నిర్మించిన భారీ పాన్‌ ఇండియా చిత్రం ఇది. ప్రముఖ కన్నడ దర్శకుడు ఆర్‌ చంద్రు దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కేజీఎఫ్‌ చిత్రం ఫేమ్‌ రవి బస్రూర్‌ సంగీతాన్ని అందించారు.

నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రాన్ని 7 భాషల్లో  కన్నడ చిత్ర పరిశ్రమ అప్పు అని అభిమానంతో పిలుచుకునే పునీత్‌ రాజ్‌కుమార్‌ జయంతి సందర్భంగా మార్చి 17న విడుదల చేయనున్నట్లు చిత్ర వర్గాలు వెల్లడించాయి. చిత్ర వివరాలకు సంబంధించి దర్శకుడు మాట్లాడుతూ గ్యాంగ్‌స్టర్‌  నేపథ్యంలో రూపొందిన చిత్రం కబ్జా అని తెలిపారు. 1947 ప్రాంతంలో ఒక స్వాతంత్య్ర సమరయోధుడు వేధింపులకు గురవుతాడన్నారు. ఆయన కుమారుడు గ్యాంగ్‌స్టర్‌ ముఠాలో చిక్కుకుంటాడని ఆ తర్వాత జరిగే కథే ఈ కబ్జా చిత్రం అని చెప్పారు. 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)