Breaking News

రజనీకాంత్ సినిమాలో మరో స్టార్‌ హీరో ఎంట్రీ..?

Published on Sat, 08/24/2024 - 20:16

సూపర్ స్టార్ రజనీకాంత్- డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం 'కూలీ'. ఇది రజనీ 171వ చిత్రం. సన్‌ పిక్చర్స్‌ పతాకంపై కళానిధి మారన్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నటిస్తున్న నటీనటుల గురించి పలు రూమర్స్‌ వచ్చాయి. తాజాగా ఇప్పుడు మరో స్టార్‌ హీరో తెరపైకి వచ్చింది. భారీ అంచనాలున్న ఈ సినిమాపై సినీ అభిమానులు ప్రత్యేకమైన ఆసక్తిని కనబరుస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్‌ సంగీతం అందిస్తున్నారు.

ఈ సినిమాలో నటిస్తున్న తారల గురించీ ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. ఇదొక మల్టీస్టారర్‌ సినిమా తరహాలో తెరకెక్కబోతోందని, ఇందులో టాలీవుడ్‌ హీరో నాగార్జునతో పాటు  ఫహద్ ఫాసిల్‌  కీలక పాత్రలలో నటించనున్నారని తమిళ సినీవర్గాలు మాట్లాడుకుంటున్నాయి. అయితే, తాజాగా  క‌న్న‌డ సూప‌ర్ స్టార్ 'ఉపేంద్ర' ఈ ప్రాజెక్ట్‌లో న‌టిస్తున్న‌ట్లు స‌మాచారం. ఒక కీలకమైన పాత్ర కోసం ఆయన్ను తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, దీని గురించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

కొద్దిరోజుల క్రితమే కూలీ సినిమా షూటింగ్‌ షెడ్యూల్‌ హైదరాబాద్‌లో ముగిసింది. దాదాపు 25రోజుల పాటు ఈ షెడ్యూల్‌ ఇక్కడే కొనసాగింది. బంగారం స్మగ్లింగ్‌ మాఫియా నేపథ్యంలో సాగే యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఈ చిత్రం ఉండనున్నట్లు తెలిసింది. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)