Breaking News

ఈ వారం థియేటర్‌/ ఓటీటీలో అలరించే చిత్రాలివే

Published on Tue, 03/14/2023 - 12:05

టాలీవుడ్‌లో ప్రస్తుతం చిన్న చిత్రాల హవా కొనసాగుతుంది. గత కొన్ని వారాలుగా బాక్సాఫీస్‌ బరిలో పెద్ద చిత్రాలేవి లేకపోవడంతో.. వరుసగా చిన్న సినిమాలు రిలీజ్‌ అవుతున్నాయి. ఇక ఈ వారం కూడా అటు ఓటీటీలో ఇటు థియేటర్స్‌లో చిన్న చిత్రాలే రిలీజ్‌ కాబోతున్నాయి.  మార్చి మూడో వారంలో రిలీజ్‌ కాబోతున్న సినిమాలపై ఓ లుక్కేయండి.

కబ్జ

కన్నడ స్టార్స్‌ ఉపేంద్ర, సుదీప్‌, శివరాజ్‌ కుమార్‌ హీరోలుగా నటంచిన మల్టీస్టారర్‌ ‘కబ్జ’. ఆర్‌. చంద్రు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రముఖ హీరో పునీత్‌ రాజ్‌కుమార్‌ జయంతిని పురస్కరించుకొని ఈ నెల 17న తెలుగు, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో ఈ చిత్రం విడుదల కాబోతుంది. 

ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి

ఊహలు గుసగుసలాడే', 'జ్యో అచ్యుతానంద' వంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత నటుడు నాగశౌర్య, దర్శకుడు శ్రీనివాస్ అవసరాల కలయికలో వస్తున్న హ్యాట్రిక్ ఫిల్మ్  'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి'.  ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.  'కళ్యాణ వైభోగమే' చిత్రంలో నాగశౌర్యకు జోడిగా నటించి వెండితెరపై మ్యాజిక్ చేసిన మాళవిక నాయర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 17న థియేటర్స్‌లో విడుదల కాబోతుంది. 

ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు
‘సార్‌’

కోలీవుడ్‌ స్టార్‌ హీరో ధనుష్‌  తొలిసారిగా తెలుగులో కథానాయకుడిగా నటించిన చిత్రం సార్‌. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ మూవీ ఫిబ్రవరి 17న విడుదలై సూపర్‌ హిట్‌ కొట్టింది. సంయుక్తా మీనన్ హీరోయిన్. స‌ముద్రఖ‌ని, హైప‌ర్ ఆది, తనికెళ్ళ భరణి, అక్కినేని సుమంత్ ఈ చిత్రంలో కీలక పాత్రల్లో కనిపించారు. ఇక థియేటర్‌ ఆడియన్స్‌ను అలరించిన ఈ చిత్రం.. ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్దమైంది. ఈ నెల 17  నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది.

సత్తిగాని రెండెకరాలు


‘పుష్ప’ స్నేహితుడిగా నటనకు గానూ మంచి మార్కులు కొట్టేసిన జగదీశ్ ప్రతాప్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘సత్తిగాని రెండెకరాలు’. దీనికి అభినవ్ రెడ్డి దర్శకుడు. వెన్నెల కిశోర్ .. మోహనశ్రీ ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్న ఈ మూవీ మార్చి 17వ తేదీ నుంచి ‘ఆహా’ వేదికగా స్ట్రీమింగ్ కానుంది.

రైటర్‌ పద్మభూషన్‌


కలర్‌ ఫోటో ఫేమ్‌ సుహాస్‌ హీరోగా నటించిన తాజా చిత్రం ‘రైటర్‌ పద్మభూషన్‌’. ఫిబ్రవరి 3న విడుదలైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకొని మంచి విజయం సాధించింది.  షణ్ముఖ ప్రశాంత్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో అలరించేందుకు సిద్దమైంది. మార్చి 17నుంచి ప్రముఖ ఓటీటీ జీ5లో ఈ చిత్రం స్ట్రీమింగ్‌ కానుంది. 

నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలయ్యే చిత్రాలు/సిరీస్‌లు..
మనీషాట్- మార్చి 15
కుత్తే (హిందీ చిత్రం)- మార్చి 16
షాడో అండ్ బోన్(వెబ్ సిరీస్-సీజన్ 2)- మార్చి 16
మేస్ట్రో(వెబ్ సిరీస్)- మార్చి 17
ఇన్ హిజ్ షాడో మార్చి(సినిమా)- మార్చి 17
ది మెజిషియన్ ఎలిఫెంట్(సినిమా)- మార్చి 17

అమెజాన్ ప్రైమ్ వీడియో
బ్లాక్ ఆడమ్(ఇంగ్లీష్)- మార్చి 15
డోమ్ (వెబ్ సిరీస్-సీజన్ 2)- మార్చి 17

ఆహా..
సత్తిగాని రెండెకరాలు(తెలుగు)- మార్చి 17
లాక్డ్ (వెబ్ సిరీస్ సీజన్ 2)- మార్చి 17

జీ5
లాక్(తమిళం)- మార్చి 17
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్..
పాప్ కౌన్(హిందీ సిరీస్)- మార్చి 17

సోనీ లివ్..
రాకెట్ బాయ్స్(హిందీ సిరీస్ 2)- మార్చి 16

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)