Breaking News

మనవరాలు ఇంటికి వచ్చిన శుభవేళ... ఉపాసన తల్లి ఏం చేసిందంటే?

Published on Sat, 08/05/2023 - 17:04

వారసురాలి రాకతో మెగా కుటుంబం ఉబ్బితబ్బిబ్బవుతోంది. భార్య ఉపాసన గర్భంతో ఉన్నప్పుడే క్లీంకార ఎన్నో సంతోషాలను, అదృష్టాన్ని తెచ్చిపెట్టిందని మురిసిపోయాడు రామ్‌చరణ్‌. ఆర్‌ఆర్‌ఆర్‌కు ఆస్కార్‌ రావడం, ప్రపంచవ్యాప్తంగా తన నటనకు ప్రశంసలు దక్కడం, ఈ శుభసూచకాలన్నీ తన కూతురు వల్లే జరిగాయని మురిసిపోయాడు. క్లీంకార పుట్టిన తర్వాత వారి సంతోషం రెట్టింపయింది. ఇకపోతే చిరంజీవికి కోకాపేటలో ఉన్న ఆస్తుల రేట్లు పెరగడాన్ని కూడా క్లీంకారతో ముడిపెడుతున్నారు మెగా అభిమానులు. క్లీంకార అడుగుపెట్టిన వేళావిశేషం.. చిరు కుటుంబానికి అన్నీ కలిసొస్తున్నాయని కామెంట్లు చేస్తున్నారు.

ఇకపోతే బిడ్డ పుట్టిన తర్వాత తొలిసారి ఉపాసన పుట్టింటికి వెళ్లినట్లు ఫిల్మీదునియాలో ఓ వార్త వైరలవుతోంది. ఈ క్రమంలో ఉపాసన తల్లి శోభన మనవరాలి కోసం ఘనమైన ఏర్పాట్లు చేసిందట! తన మనవరాలిని ఇంట్లోకి తీసుకొచ్చేముందు పనివాళ్లతో దిష్టి తీయించిందట! అంతేకాదు, దిష్టి తీసిన పనివాళ్లకు ఏకంగా రూ.10 లక్షలు ఇచ్చినట్లు ఓ వార్త వైరలవుతోంది. తర్వాత కూతురిని ఇంట్లోకి తీసుకెళ్లిన ఆమె మనవరాలితో ఆడుకుందట!

అయినా దిష్టి తీసినందుకు వందలు, వేలు ఇస్తారు, అంతేకానీ ఇలా లక్షల్లో డబ్బు ఇవ్వడమేంటని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. మెగా అభిమానులు మాత్రం.. తన మనవరాలు తొలిసారి ఇంటికి వచ్చిన శుభ సందర్భంలో పనివాళ్లకు బహుమతి ఇచ్చిందనుకోవచ్చుగా.. అని కామెంట్లు పెడుతున్నారు. ఏదేమైనా మెగా మనవరాలు క్లీంకార మాత్రం అప్పుడే పెద్ద సెలబ్రిటీ అయిపోయింది!

చదవండి: రూ.2 లక్షలిస్తా.. కమిట్‌మెంట్‌ ఇస్తావా? అని అడిగాడు: హీరోయిన్‌
లలిత్‌ మోదీతో బ్రేకప్‌.. క్లారిటీ ఇచ్చేసిన సుష్మితా సేన్‌

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)