Breaking News

ఆస్కార్‌ నామినేషన్‌.. ఇండియాలో రిలీజ్‌కు నోచుకోని చిత్రం

Published on Fri, 03/28/2025 - 13:19

యూకే నుంచి ఆస్కార్‌కు నామినేట్‌ అయిన సినిమా సంతోష్‌ (Santosh Movie). బ్రిటీష్‌ ఇండియన్‌ ఫిలిం మేకర్‌ సంధ్యా సూరి తెరకెక్కించిన ఈ మూవీ భారత్‌లో రిలీజ్‌కు నోచుకోవడం లేదు. పలు సున్నితమైన అంశాలను చూపించడంపై సెన్సార్‌ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసిందని చిత్రయూనిట్‌ వెల్లడించింది. కొన్ని సన్నివేశాలను తీసేయమని కోరిందని, అది ఇష్టం లేకపోవడం వల్లే భారత్‌లో దీన్ని విడుదల చేయడం లేదని పేర్కొంది.

ఎంతో ప్రయత్నించా..
దీని గురించి సంధ్యా సూరి (Sandhya Suri) మాట్లాడుతూ.. సినిమాలో చూపించిన సమస్యలు భారత్‌కు కొత్తేమీ కాదు. వీటి గురించి గతంలోనూ ఎన్నో సినిమాల్లో ప్రస్తావించారు. అయినప్పటికీ మా సినిమా రిలీజ్‌కు ఎన్నో ఆంక్షలు పెడుతున్నారు. బహుశా మా సినిమాలో హీరో లేకపోవడం నచ్చట్లేదేమో! ఈ మూవీని భారత్‌లో రిలీజ్‌ చేయడం నాకెంతో అవసరం. దీనికోసం అన్నిరకాలుగా ప్రయత్నించాను. కానీ ఏదీ వర్కవుట్‌ కావడం లేదు. మా చిత్రంలో కొన్ని సన్నివేశాలు తొలగించమని సీబీఎఫ్‌సీ కోరింది. వారు చెప్పినట్లు చేస్తే కథ తీవ్రత తగ్గిపోతుంది. సినిమాను దెబ్బతీయడం ఇష్టం లేక రిలీజ్‌ చేయడం లేదు. ఇది మాకెంతో బాధగా ఉంది అని పేర్కొంది.

ఆస్కార్‌ నామినేషన్‌
చిన్న వయసులోనే భర్తను కోల్పోయిన మహిళ కథ ఇది. వితంతువు పోలీసుగా మారి.. దళిత అమ్మాయి హత్య కేసును ఎలా ఛేదిస్తుందన్నది సినిమాలో చూపించారు. కుల వివక్ష, అంటరానితనం, అధికారుల క్రూరత్వం, లైంగిక వేధింపులను ప్రస్తావించారు. ఈ చిత్రం కేన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో ప్రదర్శితమైంది. అలాగే యూకే నుంచి అంతర్జాతీయ ఫీచర్‌ ఫిలిం కేటగిరీలో ఆస్కార్‌కు అధికారికంగా ఎంట్రీ ఇచ్చింది. డిసెంబర్‌లో షార్ట్‌ లిస్ట్‌ అయినప్పటికీ అవార్డు అందుకోలేకపోయింది. ఈ సినిమాలో కథానాయికగా నటించిన శెహానా గోస్వామి ఉత్తమ నటిగా ఏషియన్‌ ఫిలిం అవార్డు గెలుచుకుంది.

చదవండి: మలయాళంలో బిగ్గెస్ట్‌ ఓపెనింగ్‌.. ఎల్‌ ఎంపురాన్‌ ఫస్ట్‌ డే కలెక్షన్స్‌ ఎంతంటే?

Videos

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)