Breaking News

‘ఉద్వేగం’ మూవీ రివ్యూ

Published on Thu, 11/28/2024 - 18:11

టైటిల్‌: ఉద్వేగం
నటీనటులు: త్రిగుణ్, దీప్సిక, శ్రీకాంత్ అయ్యంగార్, సురేష్, పరుచూరి గోపాలకృష్ణ, శివ కృష్ణ, అంజలి తదితరులు 
నిర్మాతలు: జి శంకర్, ఎల్ మధు
దర్శకుడు: మహిపాల్ రెడ్డి
సంగీతం: కార్తిక్ కొడగండ్ల
సినిమాటోగ్రఫీ: జి.వి. అజయ్ కుమార్
ఎడిటర్: జశ్వీన్ ప్రభు
విడుదల తేది: నవంబర్‌ 29, 2024

కథేంటంటే..
మహీంద్రా (త్రిగుణ్‌) ఓ లాయర్‌. క్రిమినల్‌ కేసులు వాధించడంలో దిట్ట. కేసులుంటే కోర్టుకు వెళ్లడం లేదంటే ప్రియురాలు అమ్ములు(దీప్సిక)తో గడపడం..ఇదే మహీంద్ర దినచర్య. ఇలా జీవితం సాఫీగా సాగిపోతున్న సమయంలో , ఓ గ్యాంగ్‌ రేప్‌ కేసు మహీంద్రా దగ్గరకు వస్తుంది. మొదట ఈ కేసు వాదించేందుకు మహీంద్రా నిరాకరిస్తాడు. కానీ ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల మళ్లీ ఈ కేసును టేకాప్‌ చేస్తాడు. ఆ కేసులో ఏ2 అయిన సంపత్‌  తరపున వాదించేందుకు మహీంద్రా రంగంలోకి దిగుతాడు. ప్రత్యర్థుల తరపున వాదించేందుకు సీనియర్‌ లాయర్‌ ప్రసాద్‌(శ్రీకాంత్‌ అయ్యంగార్‌) రంగంలోకి దిగుతాడు.ఈ గ్యాంగ్‌ రేప్‌ మహీంద్రా జీవితంలో ఎలాంటి మలుపులు తిప్పింది? ఈ కేసులో ఎవరు గెలిచారు? చివరకు ఏం జరిగింది? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

ఎలా ఉందంటే.. 
కోర్డు డ్రామా సినిమాలు ఇప్పటికే చాలా వచ్చాయి. అన్నింటిలోనూ హీరో అమ్మాయిల తరపున వాదిస్తుంటాడు. కానీ హీరో బాధిత అమ్మాయిల తరపున కాకుండా నిదింతుడి తరపున వాదించడం అనేది ఈ సినిమాలో కొత్త పాయింట్‌. దర్శకుడు ఇలాంటి పాయింట్‌ ఎంచుకోవడంలోనే సగం సక్సెస్‌ అయ్యాడని చెప్పాలి. అయితే కథను ప్రారంభించిన విధానం కాస్త నెమ్మదిగా ఉంటుంది. 

అసలు కథను ప్రారంభించడానికి దర్శకుడు ఎక్కువ సమయం తీసుకున్నాడు. హీరో చేతికి గ్యాంగ్‌ రేప్‌ కేసు వచ్చిన తర్వాత కథపై ఆసక్తి పెరుగుతుంది. కోర్టు రూమ్ సన్నివేశాలు, ట్విస్ట్ లు  ఆకట్టుకున్నాయి. అదే సమయంలో కొన్ని సన్నివేశాలు మరీ సినిమాటిక్‌గా, వాస్తవికానికి చాలా దూరంగా ఉన్నట్లు అనిపిస్తాయి. శ్రీకాంత్ అయ్యంగార్, త్రిగుణ్ మధ్య వచ్చే సన్నివేశాలను మరింత బలంగా రాసుకొని ఉంటే బాగుండేది. నిడివి తక్కువగా ఉండడం సినిమాకు కలిసొచ్చిందనే చెప్పాలి. 

ఎవరెలా చేశారంటే..
లాయర్‌ మహీంద్రగా త్రిగుణ్‌ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు.   దీప్సిక తన పాత్ర పరిధిమేర చక్కగా నటించింది. హీరోహీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. త్రిగుణ్ గురువు పాత్రలో పరుచూరి గోపాలకృష్ణ ఎప్పటిలాగే తన మార్క్ చూపించారు. జడ్జిగా సీనియర్ నటుడు సురేష్ చేసే కామెడీ నవ్వులు పూయిస్తుంది. ఇక లాయర్  ప్రసాద్‌గా శ్రీకాంత్ అయ్యంగార్  ఎప్పటిమాదిరి తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. సీనియర్ నటుడు శివకృష్ణ కూడా తాను పోషించిన పోలీస్ పాత్రకు పూర్తి న్యాయం చేశారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. కార్తిక్ కొడగండ్ల సంగీతం బాగుంది. జి.వి. అజయ్ కుమార్ కెమెరా పనితనం పర్వాలేదు. ఎడిటర్‌ జశ్వీన్‌ ప్రభు తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. 
రేటింగ్‌: 2.25/5

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)