Breaking News

ఆ మాట అనడంతో చిన్నబుచ్చుకుంది.. అన్నయ్యలా తెల్లగా అవుతానమ్మా..

Published on Mon, 06/10/2024 - 17:42

చిన్నపిల్లలు ఎంతో సున్నిత మనస్కులు. కాస్త కోపంగా చూస్తేనే చిన్నబుచ్చుకుంటారు. అలాంటిది ఎవరైనా ఏమైనా అంటే అస్సలు తట్టుకోలేరు. కానీ కొందరు నోటికి ఎంతొస్తే అంత అనేస్తుంటారు. అలా బంధువు అన్న మాటలకు తన కూతురు నొచ్చుకుందని చెప్తోంది స్టార్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ సతీమణి, నటి, రచయిత్రి ట్వింకిల్‌ ఖన్నా.

శరీరం ట్యాన్‌ అవుతోందని..
నా కూతురు నితార స్విమ్మింగ్‌ క్లాసులకు వెళ్లేది. కానీ ఓసారి సడన్‌గా క్లాసులకు వెళ్లడం మానేస్తానంది. ఎండలో ట్యాన్‌ అయిపోయి శరీరం నల్లగా అవుతోందని చెప్పింది. అన్నయ్య (ఆరవ్‌) ఎంత తెల్లగా ఉన్నాడో నేనూ అలాగే అవుతానని చెప్పింది. తనకలాంటి ఆలోచన రావడానికి కారణం.. మా బంధువే! నీ పాప చాలా క్యూట్‌గా ఉంది కానీ ఆమె ఆరవ్‌ అంత తెల్లగా లేదు అని తెలివితక్కువగా మాట్లాడింది. ఆ మాటలు నా కూతురు విని బాధపడింది.

అది చదివాకే మార్పు
రంగు ముఖ్యం కాదని తనకెలా చెప్పాలా? అనుకున్నాను. ఫ్రిదా ఖలో బయోగ్రఫీని ఆమె చేతికిచ్చాను. ఖలో ఒక మెక్సికన్‌ పెయింటర్‌. మనిషి శరీరం, ఐడెంటిటీ, మరణం, వ్యక్తిత్వం.. ఇలా ఎన్నింటినో అందులో చర్చించింది. ఆ పుస్తకం చదివాక నితార ఆలోచనలో మార్పు వచ్చింది. తెలుపు అనేది లైట్‌ కలర్‌.. నా టీషర్ట్‌లాగా త్వరగా మురికిపడుతుంది. అదే బ్రౌన్‌.. కాస్త డార్క్‌ కలర్‌.. అంత ఈజీగా మురికిపడదు అని నితార ఫీలైంది అని ట్వింకిల్‌ ఖన్నా చెప్పుకొచ్చింది.

చదవండి: నిన్ను టీవీలోనే చాలామంది చూశారు.. ఇంకా ఓటీటీలో కష్టమే అన్నారు

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)