Breaking News

ఫ్యామిలీలో కొత్త మెంబర్‌.. బుల్లితెర జంట పోస్ట్‌

Published on Mon, 11/03/2025 - 13:25

నువ్వే కావాలి, ప్రేమించు వంటి సినిమాలతో ఒకప్పుడు వెండితెరపై సందడి చేశాడు సాయి కిరణ్‌ (Actor Sai Kiran). ప్రస్తుతం మాత్రం బుల్లితెరపై పలు సీరియల్స్‌ చేస్తూ బిజీ అయ్యాడు. కోయిలమ్మ సీరియల్‌లో నటించే సమయంలో సహనటి స్రవంతి (Actress Sravanthi)తో ప్రేమలో పడ్డాడు. 2024 డిసెంబర్‌లో పెళ్లి చేసుకున్నాడు. ఇటీవలే స్రవంతి.. తాను గర్భం దాల్చిన విషయాన్ని సోషల్‌ మీడియాలో వెల్లడించింది.

ఫ్యామిలీలో కొత్త మెంబర్‌
తాజాగా తమ కుటుంబంలోకి కొత్త మెంబర్‌ చేరినట్లు తెలిపింది. ఏంటి? అప్పుడే డెలివరీ అయిందా? అనుకునేరు.. కాదు! స్రవంతి భర్త కోసం రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌ కానుకగా ఇచ్చింది. ఈ మేరకు ఓ వీడియోతోపాటు పలు ఫోటోలు షేర్‌ చేసింది. బుల్లెట్‌ బైక్‌ అంటే తన భర్తకు ఎంతో ఇష్టమని చెప్తోంది. అందుకే ఈ బైక్‌ను కానుకగా ఇచ్చినట్లు తెలిపింది.

గతేడాది థార్‌.. ఇప్పుడు బైక్‌
స్రవంతి షేర్‌ చేసిన వీడియోలో వీరిద్దరూ కొత్త బైక్‌ ముందు కేక్‌ కట్‌ చేసి సెలబ్రేట్‌ చేసుకున్నారు. తర్వాత జంటగా ఫోటోలకు పోజిచ్చారు. గతేడాది వీరు మహీంద్రా థార్‌ సొంతం చేసుకున్నారు. ఏడాది తిరిగేసరికి ఇప్పుడు బుల్లెట్‌ బైక్‌ కొన్నారు. ఇది చూసిన అభిమానులు సాయికిరణ్‌ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

 

 

చదవండి: నేనే హీరోయిన్‌ అన్నారు.. ఇంత మోసం చేస్తారనుకోలేదు!

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)