Breaking News

ఎంతోసేపు పురిటినొప్పులు భరించాక పుట్టావురా.. నటి భావోద్వేగం

Published on Sat, 07/05/2025 - 19:24

బుల్లితెర నటి సమీరా షెరిఫ్‌ (Sameera Sherief) సంతోషంలో తేలియాడుతోంది. ఇటీవల ఆమె రెండోసారి పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే! తాజాగా ఈ బుడ్డోడికి పేరు కూడా పెట్టేసింది. ఆ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా వెల్లడిస్తూ పిల్లాడి ఫేస్‌ను రివీల్‌ చేసింది. 'సయ్యద్‌ ఆమిర్‌'ను మీ అందరికీ పరిచయం చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఈ జర్నీ అంత ఈజీగా జరగలేదు. గర్భవతిగా ఉన్నప్పుడు ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను. అప్పుడు నా కడుపులో ఉన్న ఆమిర్‌ నన్ను గట్టిగా పట్టుకున్నాడు. 

నీకోసం నేను నిలబడతా
నేను బాధలో ఉన్నప్పుడు దాన్ని అధిగమించే శక్తినిచ్చాడు. ఏం జరుగుతుందో? ఏంటో? అన్న భయంలో కూరుకుపోయినప్పుడు నాకు ధైర్యాన్నిచ్చాడు. ఇప్పుడు బయట ప్రపంచంలోకి అడుగుపెట్టిన తనకు అండగా నిలబడాల్సిన బాధ్యత నాపై ఉంది. ఈ విషయంలో మేము వెనకడుగు వేసేదే లేదు. మేమిద్దరం జంటగా అన్నీ ఎదుర్కొన్నాం. లేబర్‌ గదిలో చాలాసేపు పురిటినొప్పుల బాధ అనుభవించాక వీడు పుట్టాడు. ఇది మా హృదయాల్లో శాశ్వతంగా గుర్తుండిపోతుంది.

గర్విస్తున్నాం
ఆమిర్‌.. నువ్వు మా జీవితాల్లోకి రావడం ఆ దేవుడి ఆశీర్వాదంగా భావిస్తున్నాం. మాటల్లో చెప్పలేనంతగా ప్రేమిస్తున్నాం. హీరా భయ్యా కూడా ఫుల్‌ ఖుషీ అవుతున్నాడు. నిన్ను ఎప్పుడెప్పుడు ఎత్తుకోవాలా? అని రోజులు లెక్కపెట్టుకుంటూ కూర్చున్నాడు. నీకోసమే ఆలోచించాడు. మన కుటుంబమంతా నిన్ను చూసి గర్విస్తోంది అని రాసుకొచ్చింది. ఈ పోస్ట్‌కు బాబును ఎత్తుకున్న ఫోటోలను జత చేసింది. ఇది చూసిన అభిమానులు మరోసారి సమీరాకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా సమీరా.. అభిషేకం, ముద్దుబిడ్డ, భార్యామణి, ఆడపిల్ల వంటి పలు సీరియల్స్‌ చేసింది. కొన్ని షోలకు యాంకర్‌గానూ పని చేసింది.

 

 

చదవండి: నాలో ఏదైనా లోపం ఉందా? సరైన దారిలో లేనా?.. ఏడ్చేసిన మిత్ర

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)