Breaking News

తనకంటే చిన్నవాడితో లవ్‌.. రెండేళ్లకే బ్రేకప్‌ చెప్పిన నటి

Published on Thu, 05/18/2023 - 16:37

బుల్లితెర జంట జీషన్‌ ఖాన్‌, రేహ్న పండిత్‌(రేహ్న మల్హోత్రా) విడిపోయారంటూ గత కొంతకాలంగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. తాజాగా అదే నిజమైంది. తమ మధ్య ప్రేమబంధం ముగిసిందని నటి రేహ్న వెల్లడించింది. ఆమె మాట్లాడుతూ.. 'జీషన్‌తో నా ప్రయాణం ముగిసింది. మేమిద్దరం కలిసి ఉండట్లేదు. మళ్లీ కలవాలన్న ఆలోచన కూడా లేదు. గతకొంతకాలంగా జరుగుతున్న ప్రచారానికి తెరదించాలనుకున్నాను. అందుకే ఈ విషయం చెప్తున్నా.

ఇక మీదట జీషన్‌ గురించి నన్ను ఎటువంటి ప్రశ్న అడగకండి. ఎందుకంటే అంతా అయిపోయింది. ఇక్కడితో దీన్ని వదిలేయండి' అని చెప్పుకొచ్చింది. అటు జీషన్‌ కూడా 'అవును, బ్రేకప్‌ చెప్పుకున్నాం. ఇక మీదట దీని గురించి మాట్లాడాలనుకోవడం లేదు. నా వైపు నుంచి చివరిసారిగా రేహ్నకు వీడ్కోలు చెబుతున్నా' అని తెలిపాడు. కాగా జీషన్‌, రేహ్న కుంకుమ్‌ భాగ్య సీరియల్‌ సెట్‌లో కలిశారు. అప్పటినుంచే ప్రేమలో ఉన్నారు. 2021 అక్టోబర్‌లో తమ ప్రేమను అధికారికంగా వెల్లడించారు.

జీషన్‌ కన్నా రేహ్న వయసులో పెద్దదైనప్పటికీ ఎప్పుడూ తమ మధ్య పొరపచ్చాలు రాలేదని వీరు గతంలో చెప్పుకొచ్చారు. ఏమైందో ఏమో కానీ సడన్‌గా గత నెలలో రేహ్నాతో బ్రేకప్‌ అయిందని పోస్ట్‌ పెట్టాడు జీషన్‌. మళ్లీ ఆ వెంటనే.. అలాంటిదేమీ లేదని కలిసిపోయామని క్లారిటీ ఇచ్చారు. కాకపోతే కొన్ని గొడవలు జరిగాయని, ఇద్దరం వాటి నుంచి బయటపడి ఒకరినొకరు అర్థం చేసుకుని కలిసిపోవడానికి సమయం పట్టిందన్నారు. ఒక్కసారి ప్రేమించాక జీవితాంతం తన చేయి వదలనని చెప్పాడు జీషన్‌. గొడవలకు ముగింపు పలికి మళ్లీ కలిసిపోయారనుకుంటున్న సమయంలో శాశ్వతంగా విడిపోతున్నట్లు వెల్లడించి ఫ్యాన్స్‌కు షాకిచ్చింది జంట.

చదవండి: రష్మికను నేనేమీ అనలేదు: ఐశ్వర్య రాజేశ్‌

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)