Breaking News

13 ఏళ్లకే పెళ్లి.. 14 ఏళ్లకే తల్లి.. భర్త వదిలేశాడు.. ఈ నటి జీవితంలో అన్నీ కష్టాలే!

Published on Wed, 10/07/2026 - 16:09

సినిమా అనేది రంగుల ప్రపంచం. తెరపై ముఖానికి రంగులు వేసుకుని ప్రేక్షకులను అలరించే నటీనటుల వెనుక ఎన్నో కష్టాలు, కన్నీళ్లు, జీవిత పోరాటాలు ఉంటాయి. ఆ బాధలను అధిగమించి తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నవారే నిజమైన స్ఫూర్తిగా నిలుస్తారు. నటి రాగిణి కూడా అలాంటి వారిలో ఒకరు. బుల్లితెరతో పాటు వెండితెరపైనా తన నటనతో అలరిస్తున్న ఆమె వ్యక్తిగత జీవితం.. నిజంగా ఇప్పటి తరానికి ఆదర్శంగా నిలుస్తుంది. కేవలం 13 ఏళ్ల వయసులోనే పెళ్లి.. 14 ఏళ్లకే తల్లిగా మారిన రాగిణి.. ఆ తర్వాత ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. భర్త దూరమైనా వెనక్కి తగ్గలేదు. కొడుడును తండ్రి లేని లోటు తెలియకుండా పెంచడమే కాదు.. తన కాళ్లపై తాను నిలబడి నటిగా ఎదిగి, నలుగురూ గుర్తించే స్థాయికి చేరుకున్నారు. జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా ధైర్యంగా ముందుకు సాగితే విజయం సాధించవచ్చని ఆమె ప్రయాణం చెబుతుంది. తన వ్యక్తిగత జీవితంలో ఎదురైన అనుభవాల గురించి రాగిణి గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించిన విషయాలు ఇప్పుడు మరోసారి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

సినిమా, టీవీ రంగాల్లో తనదైన గుర్తింపు తెచ్చుకున్న నటి రాగిణి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ముఖ్యంగా ‘అమృతం’ సీరియల్‌లో అంజి భార్య శాంతగా నవ్వులు పంచిన ఆమె.. ప్రేక్షకులకు ఎంతో దగ్గరయ్యారు.  దాదాపు 30 ఏళ్లుగా చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్నారు. ఇప్పటివరకు 550కు పైగా సీరియల్స్‌తో పాటు సుమారు 190 సినిమాల్లో నటించారు. బుల్లితెర, వెండితెరపై తన నటనతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. అయితే ఆమె వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకుంటే మాత్రం.. ఈ స్థాయికి చేరుకోవడం వెనుక ఎంతటి పోరాటం ఉందో అర్థమవుతుంది.

13 ఏళ్లకే పెళ్లి.. 14 ఏళ్లకే తల్లి
గతంలో ఓ ఇంటర్వ్యూలో రాగిణి చెప్పిన వివరాల ప్రకారం.. 14 మంది పిల్లలున్న కుటుంబంలో ఆమె 12వ సంతానం. చిన్న వయసులోనే ఆమెకు పెళ్లి చేశారు. కేవలం 13 ఏళ్ల వయసులో వివాహం కాగా.. 14 ఏళ్లకే మగబిడ్డకు జన్మనిచ్చారు. పెళ్లైన తర్వాత భర్త నుంచి శారీరకంగా, మానసికంగా వేధింపులు ఎదురయ్యాయి. ముఖ్యంగా డబ్బు కోసం తనను వేధించేవాడట. పెళ్లైన కొద్దికాలానికే భర్త తనను వదిలి మరో మహిళను వివాహం చేసుకున్నాడని రాగిణి తెలిపారు. దీంతో చిన్న వయసులోనే బిడ్డతో ఒంటరిగా మిగిలిపోయారు. అయినప్పటికీ ఆమె కుంగిపోలేదు. తన జీవితాన్ని తానే చక్కదిద్దుకోవాలని నిర్ణయించుకున్నారు.

(ఇదీ చదవండి: సైలెంట్‌గా వచ్చి రూ. 150 కోట్లు కొల్లగొట్టిన తమిళ సినిమా)

డ్యాన్సర్‌గా కెరీర్ ప్రారంభం
భర్త వదిలేసిన తర్వాత రాగిణి తన చిన్న కుమారుడిని తీసుకుని కర్ణాటక నుంచి హైదరాబాద్‌కు వచ్చారు. అనారోగ్యంతో బాధపడుతున్న తన తండ్రితో పాటు తల్లిని కూడా హైదరాబాద్‌కు తీసుకొచ్చి కుటుంబ బాధ్యతలను భుజాన వేసుకున్నారు. జీవనం సాగించేందుకు తొలుత డ్యాన్స్‌ ప్రోగ్రామ్స్‌ చేసేవారు. ఒక్కో డ్యాన్స్‌ ప్రోగ్రామ్‌కు అప్పట్లో రూ.500 పారితోషికం వచ్చేదని రాగిణి చెప్పుకొచ్చారు. నెలకు ఆరు ప్రోగ్రామ్స్‌ చేస్తే సుమారు రూ.3 వేల వరకు సంపాదించేవారు. అందులో రూ.750 ఇంటి అద్దెకు, రూ.1,000 తండ్రి మందులకు, మరో రూ.1,000 కుటుంబ అవసరాలకు ఖర్చు చేసేవారు. మిగిలిన రూ.200-300ను దాచుకునేవారు. ఆ డబ్బుతో బస్సులో టీవీ కార్యాలయాలు, స్టూడియోల చుట్టూ తిరుగుతూ నటించే అవకాశాల కోసం ప్రయత్నించేవారట.

అక్క పిల్లలకు కూడా అన్నీ తానై.. 
తన పిల్లల భవిష్యత్తు కోసం రాగిణి ఎంతో కష్టపడ్డారు. ఒంటరిగానే పిల్లలను పెంచుతూ వారి చదువుకు ప్రాధాన్యం ఇచ్చారు. తన కొడుకుని మాత్రమే కాదు.. తన ఆరో అక్క పిల్లలను కూడా ఆమె చదివించారు. అక్క చనిపోవడంతో ఆ పిల్లలకు కూడా అన్నీ తానై చూసుకున్నారట.వారంతా బాగా చదువుకొని సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు అయ్యారని.. పిల్లలు జీవితంలో స్థిరపడటం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని రాగిణి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

క్యాస్టింగ్ కౌచ్‌పై రాగిణి వ్యాఖ్యలు
ఇండస్ట్రీలో తొలి రోజుల్లో ఎదురైన అనుభవాల గురించి కూడా రాగిణి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ముఖ్యంగా క్యాస్టింగ్ కౌచ్‌ అంశంపై ఆమె చేసిన వ్యాఖ్యలు అప్పట్లో చర్చనీయాంశంగా మారాయి. మహిళలు తమ హద్దులను స్పష్టంగా నిర్ణయించుకోవాలని ఆమె సూచించారు. తన అభిప్రాయం ప్రకారం.. ఎవరితో ఎలా ప్రవర్తిస్తున్నామనేది కూడా చాలా ముఖ్యమని రాగిణి చెప్పారు. ఎదుటివారితో అతిగా చనువుగా ఉండకుండా, గౌరవప్రదమైన దూరాన్ని పాటిస్తే అనవసరమైన ఇబ్బందులు తగ్గుతాయని ఆమె పేర్కొన్నారు. తాను మాత్రం ఎప్పుడూ హద్దులు దాటకుండా, తన ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండేదానినని తెలిపారు.

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)